అమితాబచ్చన్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నారు..ఆ ఎగ్జామ్ కి సంబంధించి హాల్ టికెట్ కూడా వచ్చింది. అదేంటీ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ ఇప్పుడు ఎగ్జామ్ రాయడం ఏంటీ..హాల్ టికెట్ రావడం ఏంటా అని ఆలోచిస్తున్నారు.  అవునండీ..మీరు చదివింది కరెక్టే..కాకపోతే ఇది ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్‌లోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ అధికారుల నిర్వాకం వల్ల ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 
Related image
వివరాల్లోకి వెళితే.. డాక్టర్ రాంమనోహర్ లోహియా అవధ్ యూనివర్శిటీ పరిధిలోని గోండా జిల్లా రవీంద్రసింగ్ సమారక్ మహావిద్యాలయలో అమిత్ ద్వివేది అనే విద్యార్థి బీఈడీ చదువుతున్నాడు. బీఈడీ రెండో సంవత్సరం పరీక్షలు రాసేందుకు అమిత్ ద్వివేది దరఖాస్తు ఫారం నింపి ఫోటోలు కూడా జత చేశాడు. హాల్‌టికెట్‌పై అమిత్ ఫోటోకు బదులుగా అమితాబచ్చన్ ఫోటో ఉండటంతో సదరు విద్యార్థి అవాక్కయ్యాడు. ఎగ్జామ్ సెంటర్ వద్ద అమిత్‌ను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు.
Image result for amitabh bachchan
అమిత్ తన సర్టిఫికెట్లు చూపించడంతో పరీక్షకు అనుమతించారు. అయితే ఇప్పుడు ఎగ్జామ్ రాసిన రిజల్ట్ లో తనకొచ్చే మార్కుల జాబితాలోనూ అమితాబ్ ఫోటోను ప్రచురిస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. తన హాల్ టికెట్ పై అమితాబ్ ఫోటో ప్రచురించడంపై ప్రిన్సిపాల్ కు విద్యార్థి ఫిర్యాదు చేశాడు. దీంతో మార్కుల జాబితాలో విద్యార్థి ఫోటో వచ్చేలా చూస్తామని ప్రిన్సిపాల్ హామి ఇచ్చారు.
Image result for exam
కాగా, రవీంద్ర సింగ్ స్మారక్ మహావిద్యాలయ ఉద్యోగి గుర్‌పేంద్ర మిశ్రా ఈ అంశంపై స్పందించారు. అయితే ఇలాంటి సంఘటనలు విద్యార్థులు ఆన్ లైన్ లో చేసుకోవడం వల్లే జరుగుతుందని..ఒకరి ఫోటో బదులు మరొక ఫోటో అప్ లోడ్ అవుతుందని అన్నారు. అయితే ఇందులో యూనివర్సిటీ అధికారులు పొరపాటు చేసి ఉండొచ్చని మిశ్రా పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి రాంగ్ ఫోటోలు సోషల్  మీడియాలో హల్ చల్ చేశాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: