‘బాహుబలి’ భారీవిజయం తరువాత అదే స్థాయి విజయంకోసం కష్టపడుతూ భారీ బడ్జెట్ తో పాటు అత్యున్నత స్థాయిలో గ్రాఫిక్స్ వాడుతున్న   ‘సాహో’ విడుదల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోయినా ప్రభాస్ తన కొత్తసినిమా ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. తెలుస్తున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 6న ప్రభాస్ కొత్త మూవీ పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభం కాబోతోంది అని వార్తలు వస్తున్నాయి.

దీనితో ప్రభాస్ తో సినిమా చేయాలి అని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న దర్శకుడు జిల్ రాథాకృష్ణ కల నెరవేరబోతోంది. ఈమూవీలో ప్రభాస్ పక్కన నటించే హీరోయిన్స్ గా పూజా హెగ్డే రాకుల్ ప్రీత్ సింగ్ లు ఎంపిక అయ్యారని తెలుస్తోంది. గతంలో వచ్చిన ‘జిల్’ మూవీలో దర్శకుడు రాథాకృష్ణ  హీరో గోపీచంద్ ను డీల్ చేసిన స్టైల్ నచ్చడంతో పాటు రాథా కృష్ణ చెప్పిన ఒక కొత్త తరహా ప్రేమ కథ నచ్చడంతో ప్రభాస్ ఎట్టకేలకు ఈసాహసం చేస్తున్నట్లు టాక్. 

యూరోప్ నేపథ్యంలో సాగే కొత్త తరహా ప్రేమకథ ఈనాటి యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని ప్రభాస్ అన్ని ఆలోచించి ఎట్టకేలకు లైన్ క్లియర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ ప్రభాస్ కెరియర్ లో 20 మూవీగా మారుతున్న నేపధ్యంలో ఈమూవీలోని ప్రభాస్ లుక్ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈసినిమాలోని పాత్రకోసం 10 కిలోలకు పైగా బరువు తగ్గాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు టాక్. 
'Baahubali' star Prabhas getting married to industrialist's granddaughter? Here's an update
ఈమూవీలో లవర్ బాయ్ లా ప్రభాస్ కనిపించబోతున్నాడు కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ‘సాహో’ షూటింగ్ కు సంబంధించిన బ్యాలన్స్ వర్క్ ఇంకా చాల మిగిలి ఉంది కాబట్టి ‘సాహో’ నిర్మాణం పూర్తి అయిన తరువాత మాత్రమే రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ ప్రాంతంలో ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. ‘డార్లింగ్’ తరువాత తిరిగి ప్రభాస్ లవర్ బాయ్ ఇమేజ్ కోసం ఈసినిమా ద్వారా ప్రయత్నిస్తున్నాడు..  


మరింత సమాచారం తెలుసుకోండి: