నాగచైతన్య కెరియర్ కు అత్యంత కీలకంగా మారిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముహూర్తం ఖరార్ అయింది. రాబోయే ఆదివారం సెప్టెంబర్ 9న ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఘనంగా నిర్వహించి అక్కడ నుండి ఈమూవీ ప్రమోషన్ భారీ ఎత్తున చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Naga Chaitanya,Shailaja Reddy Alludu,Ramya Krishnan
వాస్తవానికి మొదట్లో ఈ ఫంక్షన్ కు అతిధిగా జూనియర్ ఎన్టీఆర్ ను పిలవాలని భావించినా మారిన పరిస్థుతులలో జూనియర్ స్థానంలో నాగార్జునతో పాటు నానీ కూడ వచ్చి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన ‘దేవాదాస్’ ఈనెలాఖరున విడుదల అవుతున్న నేపధ్యంలో ఈజంట హీరోలకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ‘శైలజా రెడ్డి’ కి కూడా ఉపయోగ పడుతుంది అన్న వ్యూహంతో వీరిద్దరినీ అతిధులుగా నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. 
JioPhone 2 Sale kick-started today
నాగార్జునతో పాటు నాని కూడ ఈ ఫంక్షన్ కు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి అని అంటున్నారు. ‘శైలజా రెడ్డి’ ని నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో త్వరలో నాని ఒక సినిమాను చేయబోతున్నాడు. అంతేకాదు ఈమూవీకి దర్శకత్వం వహించిన మారుతి తనకు గతంలో ‘భలే భలే మగాడివోయ్’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన నేపధ్యంలో ఈ రెండు ఋణాలను తీర్చుకోవడానికి నాని నాగార్జునతో కలిసి రెండవ అతిధిగా రావడం వెనుక గల కారణం అన్న ప్రచారం జరుగుతోంది.
Devadas teaser,Devadas movie,Nani
అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ‘శైలజా రెడ్డి’ మూవీ కంటే నాగార్జున నానీల ‘దేవదాస్’ గ్యారెంటీ హిట్ అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో నాగచైతన్య ‘శైలజా రెడ్డి’ సినిమా ఫంక్షన్  లో ‘దేవాదాస్’ ప్రీ రిలీజ్ వేడుకలు జరగబోతున్నాయా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. ఈ మాటలు ఎలా ఉన్నా నాగార్జున నానీల క్రేజ్ నాగచైతన్యకు ఎంతఆకు అదృష్టంగా మారుతుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: