మన సంస్కృతిలో గురువుకి చాలా గొప్ప స్థానం ఉంది. తల్లిదండ్రుల తరువాత ఆస్థానాన్ని గురువుకు ఇస్తారు. "గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. అ ఆ ల నుండి ఆర్కుట్ వరకు భయభక్తుల నుంచి బ్లాగుల వరకు ఉన్న ఈప్రస్థానంలో మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసేది ఉపాధ్యులు మాత్రమే. మనదేశంలో పాఠశాల లేని పల్లెటూరైనా ఉండొచ్చేమోగానీ ఉపాధ్యాయుడు లేని ఊరుమాత్రం ఉండదు. 

వేదాలలో గురువుకి దేవుడి కన్నా అగ్రతాంబూలం ఇచ్చారు. గురు బ్రహ్మః గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మః తస్మైశ్రీ గురవే నమః అంటూ గురువు ప్రాముఖ్యాన్ని మన వేదాలు తెలియచేసాయి. సర్వేపల్లి రాథాకృష్ణ జీవించి ఉన్న సమయంలో కొంతమంది విద్యార్ధులు స్నేహితులు కలిసి ఆయన పుట్టినరోజు అయిన నేటిరోజున ఆయనని సన్మానించడానికి ప్రయత్నిస్తే ఆవేడుకను  తన పుట్టినరోజుగా కాకుండా ఈరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేస్తే తనకు ఆనందం అని చెప్పడంతో  ఈ ఉపాధ్య దినోత్సవం మొదలైంది అని అంటారు. 
వేదాలలో దేవుళ్లకన్నా గురువుకే అగ్రతాంబూలం ఇచ్చారు
తల్లి లేదా తండ్రి తప్పు చేస్తే కేవలం ఆకుటుంబం మాత్రమే నష్టపోతుంది కానీ అదే ఒక గురువు తప్పు చేస్తే  ఒక సమాజం నష్టపోతుంది. ఒకప్పుడు బ్రతకలేక బడిపంతులు అనిపించుకున్న వృత్తి నేడు బ్రతుకు కొరకు బడిపంతులు అని వేనోళ్ళ కీర్తించ బడుతుందంటే అందుకు కారణం  నవసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడుకు పెరిగిన ప్రాముఖ్యత.  మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిల మధ్య బంధాన్ని  అసలు సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం.
Teacher’s Day 
తరతరాలుగా యుగయుగాలుగా సనాతన భారతీయ సంస్కృతిలోని  పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా సులభంగా స్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు సర్వేపల్లి రాధ కృష్ణ. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహారచయిత సర్వేపల్లి రాధాకృష్ణ అని కుడా అంటారు.  ఒక మనిషిని మనీషి లా మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఒక్క గిరువుకు మాత్రమే ఉంది. ఇలాంటి పవిత్రమైన ఈరోజున ప్రతి ఒక్కరు తమ గురువులను స్మరించి కుంటూ జరుపుకుంటున్న ఈఉపాధ్య దినోత్సవం అందరిలో జ్ఞానజ్యోతులు వెలిగించాలని ఇండియన్ హెరాల్డ్ మనస్పూర్తిగా కోరుకుంటూ  ఉపాధ్యాయులు అందరికీ శుభాకాంక్షలు అందిస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: