తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కొత్త దర్శకులు మంచి చిత్రాలు తెరకెక్కిస్తు ప్రేక్షకులను అలరిస్తున్నారు.  ఈ నేపథ్యంలో తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’, సందీప్ వంగా ‘అర్జున్ రెడ్డి’చిత్రం..రానాతో  'ఘాజీ' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి సక్సెస్ ను సాధించాడు.  కంటెంట్ బాగుంటే ఎలాంటి చిత్రాలనైనా ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి వీరు తీసిన చిత్రాలే ఉదాహారణ. 
Image result for varun tej antarikthsma
 'ఘాజీ' చిత్రంతో సంకల్ప్ రెడ్డి మంచి విజయాన్ని అందుకున్నాడు. సముద్రం నేపథ్యంలో ఆ సినిమాను తెరకెక్కించి శభాష్ అనిపించుకున్న సంకల్ప్..ఈసారి ఏకంగా అంతరిక్షాన్ని కళ్లముందు ఉంచబోతున్నాడట. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. 
Image result for varun tej antarikthsma
రాజీవ్ రెడ్డి .. సాయిబాబు నిర్మిస్తోన్న ఈ సినిమా, ఈ నెల 20వ తేదీ నుంచి చివరి షెడ్యూల్ షూటింగును జరుపుకోనుంది. ఈ షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఒక పాటను కూడా చిత్రీకరించనున్నారు.  ఫిదా, తొలిప్రేమ లాంటి హిట్ చిత్రాలతో వరుణ్ తేజ్ మంచి ఊపుమీద ఉన్నాడు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జంటగా లావణ్య త్రిపాఠి .. అదితీరావు హైదరి లు నటిస్తున్నారు.  ఈ చిత్రం డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.  ఈ చిత్రంతో తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనీ, తన కెరియర్లోనే వైవిధ్యభరితమైనదిగా నిలిచిపోతుందని వరుణ్ తేజ్ భావిస్తున్నాడు.   



మరింత సమాచారం తెలుసుకోండి: