ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  తాజాగా కోలీవుడ్‌లో ఓ నటుడి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. వివాహమై ఎంత కాలమైనా పిల్లలు పుట్టడం లేదనే మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది.   పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం.. 'యాగవరాయనుమ్', 'నాకాక్క' తదితర చిత్రాల్లో నటించిన సిద్ధార్థ్, స్మిరిజ దంపతులు. వీరికి వివాహమై మూడు సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టలేదు. పిల్లల విషయంలో లోపం నీలో ఉందంటే, నీలో ఉందంటూ, ఇద్దరూ తరచూ గొడవ పడుతుండేవారు.
Siddharth Gopinath’s wife Smrija
ఈ క్రమంలో సోమవారం రాత్రి తన భార్యను తీసుకుని హోటల్‌కు వెళ్లి భోజనం చేసి వచ్చిన సిద్ధార్థ్, ఇంటికి వచ్చిన తరువాత ఆమెతో మరోసారి గొడవపడ్డాడు.  ఈ గొడవ కాస్తా బాగా ముదిరిపోయింది..సిర్మిజ ఆగ్రహంతో తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకోగా, సిద్ధార్థ్ బయట హాలులో పడుకున్నాడు.
Image result for siddharth-gopinath-s-wife-smrija-commits-suicide-
మంగళవారం ఉదయం 8.30 గంటలైనా భార్య బయటకు రాకపోవడంతో తలుపులు తట్టాడు. లోపలి నుంచి సమాధానం లేకపోవడంతో మధురవాయిల్ పోలీసులకు సమాచారాన్ని అందించాడు.పోలీసులు రంగంలోకి దిగి తలుపులు పగులకొట్టగా.. సిర్మిజా లోపల ఫ్యానుకు ఉరేసుకుని కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: