తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు వస్తున్నాయి.  తాజాగా కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో ‘దేవదాస్’ చిత్రం వస్తుంది.  ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మల్టీ స్టారర్ మూవీకి అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక దేవదాస్ చిత్రంలో  డాన్ గా నాగార్జున నటించగా, ఆయన సరసన ఆకాంక్ష సింగ్ కనిపించనుంది. ఇక డాక్టర్ గా నాని కనిపించనుండగా ఆయన జోడీగా రష్మిక మందన నటించింది.

Image result for దేవదాస్ శాటిలైట్

ఇది మల్టీ స్టారర్ మూవీ అయినప్పటికీ నాగార్జున .. నాని ఇద్దరూ కూడా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా సమాచారం. వైజయంతీ మూవీస్ తో తమకి గల అనుబంధం కారణంగానే ఈ ఇద్దరూ కూడా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్. అయితే ఈ ఇద్దరు హీరోలకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.  నాని అయితే ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం నుంచి వరుసగా విజయాలు సాధిస్తున్నాడు.  అంతే కాదు ఈ ఇద్దరు హీరోలు బుల్లితెరపై కూడా తమ సత్తా చాటిన విషయం తెలిసిందే..ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు..గతంలో నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో అలరించారు. 

Image result for దేవదాస్ శాటిలైట్

తాజాగా ‘దేవదాస్’ చిత్రానికి శాటిలైట్ హక్కులు 15 కోట్లు చెబుతున్నారట.  ఈ రేటుకు శాటిలైట్ హక్కులు అమ్ముడైతే ఈ ప్రాజెక్టు లాభాల్లో పడినట్టేనని చెప్పుకుంటున్నారు. కాగాచ ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ కు, అలాగే ఓ పాట కూడా విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సును రాబట్టింది.. మరి శాటిలైట్ రైట్స్ వల్లనే ఇంత మొత్తం వస్తే ఇక సినిమా ఎంత కలెక్షన్ చేస్తుందో నని ఫిలింనగర్ లో కొందరు అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: