టాలీవుడ్ లో ఎన్ని సినిమాల్లో నటించినా కొంత మందికి అస్సలు పేరు రాదు..కానీ ఈ మద్య ఒకటీ రెండు సినిమాలతో ఒక్కసారే స్టార్ గా మారిపోతున్నారు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ ఒకరు.    పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ..ఈ మద్య నటించిన ‘గీతాగోవిందం’ సినిమాతో ఒక్కసారే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
Image result for NOTA movie
ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిందీ అంటే మనోడి క్రేజ్ ఏ ఎలా ఉందో అర్థం అవుతుంది.  దాదాపు మూడు వారాలుగా బాక్సాఫీస్ ను గీతగోవిందం సినిమాతో కొల్లగొడుతున్న విజయ్ ఇప్పుడు మరో సినిమా ట్రయిలర్ ను వదలబోతున్నాడు.  విజయ్ దేవరకొండ తొలిసారి తెలుగు-తమిళ భాషల్లో చేస్తున్న సినిమా 'నోటా'. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తయారవుతున్న ఈ సినిమా దాదాపు మరో నెలరోజుల్లో సినిమా విడుదల కాబోతుంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై  ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నోటా' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రేపు విడుదల కాబోతుంది. అయితే ట్రయిలర్ కు ముందుగా ఓ పైలట్ ఎపిసోడ్ ను వదిలారు. చూస్తుంటే కచ్చితంగా విజయ్ దేవరకొండ మరోసారి వైవిధ్యమైన సబ్జెక్ట్ ను తీసుకున్నట్లు కనిపిస్తోంది. ది రౌడీ..ది పొలిటీషియన్..ది లీడర్ అంటూ వితవుడ్ డైలాగ్, ఓన్లీ ఆర్ ఆర్ తో ఈ పైలట్ ఎపిసోడ్ ను కట్ చేసారు. 

రాజకీయాల్లో తిరుగుబాటు చేసిన ఓ యువ నేత కథే 'నోటా' అని తెలుస్తుంది.  పక్కగా ఓ పొలిటికల్ జెంటిల్ మన్ లా కనిపిస్తున్నాడు. జ్ఞాన్ వేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జ్ఞాన్ వేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాజర్, సత్యరాజ్ తదితర సీనియర్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: