ప్రస్తుతం యూత్ ఆడియెన్స్ అంతా ఫాలో అవుతున్న కథానాయిక రష్మిక. కన్నడ నుండి వచ్చిన ఈ భామ తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. కన్నడలో కిరిక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన రష్మిక తెలుగులో ఛలో, గీతా గోవిందం హిట్స్ తో సూపర్ ఫాంలో ఉంది. ఇవే కాకుండా దేవదాస్ సినిమాలో కూడా నాని సరసన నటిస్తుంది రష్మిక.


అందం, అభినయం రెండు కలిసిన ఈ అమ్మడు తెలుగులో క్రేజీ ఫ్యాన్స్ ను ఏర్పరచుకుంది. ఇప్పుడే కాదు కాలేజ్ డేస్ లో కూడా అమ్మడు సూపర్ యాక్టివ్ అని తెలుస్తుంది. రీసెంట్ గా రష్మిక కాలేజ్ టైం డ్యాన్స్ వీడియో ఒకటి లీక్ అయ్యింది. బెంగళూరు రామయ్య సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రష్మిక అక్కడ కాలేజ్ ఫెస్ట్ లో డ్యాన్స్ వేసింది.


ధూం సాంగ్ కు అమ్మడు దుమ్మురేపే డ్యాన్స్ చేయగా ఆ వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తుంది. అప్పట్లోనే ఆ రేంజ్ డ్యాన్స్ తో రష్మిక అందరి మనసులను గెలుచుకుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది అమ్మడు. మోడల్ టూ హీరోయిన్ గా జర్నీ స్పీడందుకోగా హీరోయిన్ అయ్యాక అమ్మడు మరింత సెన్సేషన్ అయ్యింది.


ఈమధ్య గీతా గోవిందంతో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఈ అమ్మడు విజయ్ హీరోగా చేస్తున్న డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. చూస్తుంటే తెలుగులో అమ్మడు స్టార్ ఇమేజ్ తెచ్చుకుని స్టార్స్ తో కూడా అవకాశాలను అందుకునేలా ఉంది. మరి ఈ కిరాక్ పిల్ల మునుముందు ఇంకెలాంటి కిర్రాక్ అనిపించే సినిమాలు చేస్తుందో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: