జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల ‘అరవింద సమేత’ కు 100 కోట్లు కలక్షన్స్ వస్తే కాని వీరిద్దరి గౌరవం ఇండస్ట్రీ వర్గాలలో నిలబడదు. ఈకారణాలు వల్ల త్రివిక్రమ్ ఎన్నో ఆలోచనలు మరెన్నో సెంటిమెంట్లను నమ్ముకుని తన ‘అరవింద సమేత’ ను అక్టోబర్ 11న విడుదల చేయడానికి ఎంతో కష్టపడుతుంటే ఆప్రయత్నాలకు చెక్ పెడుతూ ఒకవైపు విజయ్ దేవరకొండ మరొక వైపు రామ్ గోపాల్ వర్మలు చేయబోతున్న ఎదురుదాడి హాట్ టాపిక్ గా మారింది. 
NOTA, Vijay Deverakonda
విజయ్ దేవరకొండ మ్యానియాను మళ్ళీ రిపీట్ చేయడానికి అక్టోబర్ 4న ఈమూవీ రిలీజ్ చేయబోతున్నారు. విజయ్ కెరియర్ లో ఫస్ట్ పొలిటికల్ డ్రామా మూవీగా రూపొందిన ఈమూవీలో హాట్ హాట్ లిప్ లాక్ సీన్స్ తో పాటు పొలిటికల్ డైలాగ్స్ కూడ ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఈరోజు సాయంత్రం ఈమూవీకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి వివరాలను తెలిపే టీజర్ లో విజయ్ దేవరకొండ మెహ్రిన్ తో చేసిన హాట్ లిప్ లాక్ సీన్స్ చూసిన వారు ఈమూవీ ‘అరవింద సమేత’ కు గట్టిపోటీ ఇస్తుందా అన్నసందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 
Bhairava Geetha movie release on Oct 12th
ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా వివాదాల రామ్ గోపాల్ వర్మ జూనియర్ పై డైరెక్ట్ ఎటాక్ చేయబోతున్నట్లు ప్రకటించడంతో జూనియర్ విజయ్ దేవరకొండ వర్మల మధ్య నలిగిపోయే పరిస్థుతులు ఏర్పడుతున్నాయి అనుకోవాలి. వర్మ నిర్మాతగా మారి నిర్మించిన ‘భైరవ గీత’ మూవీని ‘అరవింద సమేత’ విడుదలైన మరుసటి రోజు అక్టోబర్ 12న విడుదల చేస్తున్నట్లు ట్విట్ చేసి మరొక సంచలనానికి తెర తీసాడు. 
Aravinda Sametha photo leaked Jr NTR bonding with Naga Babu
అంతేకాదు తన ‘భైరవ గీత’ త్రివిక్రమ్ జూనియర్ ల సినిమాకు పోటీగా విడుదల అవుతోంది అంటూ వర్మ ట్విట్ చేయడంతో అసలు ‘భైరవ గీత’ లో ఏముంది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి మంచి స్పందన రావడంతో ‘నోటా’ ‘భైరవ గీత’ ల మధ్య ‘అరవింద సమేత’ పరిస్థితి ఏమిటీ అనీ ఈమూవీని భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు టెన్షన్ పడుతున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: