మెగా ఫ్యామిలీ నుండి వచ్చినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు తనకంటూ పవర్ ఫ్యాన్స్ ఏర్పరచుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి జనసేన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. తాను సినిమాలు చేయకున్నా సరే మరో మెగా హీరో కెరియర్ ను తాను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.


ఇప్పటికే మెగా హీరోలందరికి తన సపోర్ట్ అందిస్తున్న పవన్ కళ్యాణ్ త్వరలో ఇంట్రడ్యూస్ కాబోతున్న వైష్ణవ్ తేజ్ కు తన అభయ హస్తం ఇచ్చాడట. అందుకే వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా బుచ్చిబాబు డైరక్షన్ లో చేస్తుంటే సెకండ్ సినిమా బాధ్యత తాను తీసుకున్నాడు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.


త్వరలోనే దీనికి సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది. ఇక మొదటి సినిమా ముహుర్తం పెట్టకముందే సెకండ్ మూవీ ప్లాన్ చేసుకున్నాడు. డాలి డైరక్షన్ లో పవన్ కళ్యాణ్ నిర్మాతగా వైష్ణవ్ తేజ్ మూవీ ఉంటుందట. మొదటి సినిమా ఎలాగు మెగా క్రేజ్ మీద నడుస్తుంది. ఇక రెండో సినిమాకు పవర్ స్టార్ సపోర్ట్ ఇస్తున్నాడట. 


పవన్ నిర్మాతగా కాదు సపోర్ట్ ఇచ్చేందుకు ఆడియో వేడుకకి వచ్చినా మెగా ఫ్యాన్స్ హంగామా అదిరిపోద్ది. కబట్టి వైష్ణవ్ తేజ్ కెరియర్ ప్లానింగ్ లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చాలా ప్రాముఖ్యతగా మారింది. మరి మొదటి సినిమా బుచ్చి బాబు డైరక్షన్ లో వస్తుండగా మెగా ఫ్యామిలీ నుండి మరో హీరోగా వస్తున్న వైష్ణవ్ తేజ్ ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: