పవర్ స్టార్ అంటే పడిచావని వారెవ్వరు... ఆయనకు ఉన్న క్రేజి అంత. అందుకే ఇప్పుడు పవన్ కోసం ఒక్కరు కాదు ముగ్గురు తహతహాలాడుతున్నారు. దీంతో పవన్ ఎవరిని ఓకే చేస్తాడో చూడాలి.

పవన్ కళ్యాణ్ దిల్ రాజుతో సినిమా తీయడానికి ఒప్పుకున్నారు. అయితే కథ నచ్చితేనే అన్న ఆప్షన్ పెట్టాడు, దీంతో దిల్ రాజు చక్కటి కథ చూడండి పవన్ తో సినిమా చేసే చాన్స్ మీకే ఇస్తాను అంటూ ముగ్గురు డైరెక్టర్లను రంగంలోకి దించాడు.

వారు ముగ్గురు సామాన్యులు కాదు, ఒకరు వంశీపైడిపెల్లి, రెండవ వారు గోపిచంద్ మాలినేని, మూడో డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. ఈ ముగ్గురు ఇప్పడు పవన్ మెప్పించే కథ తయారీలో మునిగిపోయారు. ఈముగ్గురు ఆయన తో సినిమా తీయాలని తహతహాలాడుతున్నారు. ఈ ముగ్గురిలో పవన్ ఎవరికి దక్కుతాడో చూద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: