రానా నటుడుగానే కాకుండా తన తండ్రి సురేశ్ బాబు వ్యాపార తెలివితేటలను పూర్తిగా ఆకళింపు చేసుకుని రేపు విడుదలకాబోతున్న ‘కంచరపాలెం’ మూవీ విషయంలో అనుసరిస్తున్న వ్యూహాలు టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఈమూవీని నిర్మించింది ప్ర్రవీణ పరుచూరి అనే ఒక ఎన్ఆర్ఐ. అమెరికాలో కార్దియాలిజిస్ట్ గా పేరుగాంచిన ఈమె తనకు సినిమాల పట్ల ఉండే విపరీతమైన అభిమానంతో ‘కంచరపాలెం’ మూవీని మహా వెంకటేష్ దర్శకత్వంలో నిర్మించింది. 
'C/o Kancharapalem' selected for New York Indian Film Festival
ఈసినిమా ఇంకా విడుదల కాకుండానే న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపిక అయి అక్కడ ప్రశంసలు అందుకున్నా ఈమూవీ విడుదలకు సరైన మార్గాలు దొరకక పోవడంతో ఈమె రానాను సంప్రదించడం ఆతరువాత రానా సలహాతో సురేశ్ బాబు రంగంలోకి దిగడం జరిగింది. రెండు సంవత్సరాలు కష్టపడి తీసిన ఈసినిమాను సురేశ్ బాబు కేవలం కోటి రూపాయలకు కొనుక్కున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

అయితే ఇప్పటికే ముగిసిన ఈమూవీ ప్రీమియర్ షోను చూసిన వారు ఈమూవీ ద్వారా సురేశ్ బాబు రానాలకు కోట్లు కురవడం ఖాయం అని అంటున్నారు. ఈమూవీని ఇప్పటికే చూసిన చాలామంది ప్రముఖులు కమర్షియల్ హంగులతో గిరిగీసుకున్న తెలుగు సినిమా కంచెలను చెరిపేసే చిత్రంగా ‘C/O కంచరపాలెం’ మారుతుంది అని అంటున్నారు. వైజాగ్‌ ‌లోని ‘కంచెర‌పాలెం’ నేప‌థ్యంలో సాగే భిన్న‌మైన ప్రేమ‌క‌థ ఇది. 
Rana Seals C/O Kancharapalem Release Date
ఈమూవీలో మూడు తరలాకు సంబంధించిన ప్రేమకథలను చాల సహజంగా దర్శకుడు చూపించిన తీరును రాజమౌళి సుకుమార్ లాంటి ప్రముఖులు ప్రశంసిండంతో రేపు విడుదల కాబోతున్న ఈమూవీ పై అంచనాలు పెరుగుతున్నాయి. రానా సురేశ్ బాబులు ఈమూవీ పై పెట్టిన పెట్టుబడి కేవలం ఒకే ఒక్క రోజులో కలక్షన్స్ రూపంగా వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దీనికితోడు ఈసినిమాకు పోటీగా విడుదల అవుతున్న ‘సిల్లీ ఫెలోస్’ పై ఏమాత్రం అంచనాలు లేని పరిస్థుతులలో ఈమూవీకి ఈ వీకెండ్ అయ్యే సరికి కనీసం 3 కోట్ల నెట్ కలక్షన్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. అంతేకాదు ఈమూవీ శాటిలైట్ రైట్స్ కూడ సురేశ్ బాబు దగ్గరే ఉండటంతో ‘C/O కంచరపాలెం’ సురేశ్ బాబుకు మరో ‘పెళ్ళి చూపులు’ సినిమాగా కోట్లు కురిపించినా ఆశ్చర్యం లేదు అంటూ రానా సురేశ్ బాబుల తెలివితేటలను ప్రశంసిస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: