గతకొన్ని రోజులుగా ఫిలిం ఇండస్ట్రీని కుదిపేస్తున్న ‘మా’ అసోసియేషన్ వివాదం చిరంజీవికి తలనొప్పిగా మారడంతో మెగా స్టార్ ఈ వ్యవహారం పై తీవ్ర అసహనంతో ఉన్నాడు అన్నవార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈవివాదం మహేష్ సలహాతో చిరంజీవి వద్దకు మళ్ళీ ఫైనల్ గా చేరడమే కాకుండా ఈవివాద పరిష్కారానికి చిరంజీవి ఒక రాజీ మార్గాన్ని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
Mahesh Babu Latest Interview Photos09
‘మా’ వివాదం రకరకాల మలుపులు తీసుకోవడంతో త్వరలో ‘మా’ సంస్థ అమెరికాలో నిర్వహింపబోయే మరో ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి మహేష్ హాజరు కావడం లేదు అన్నవార్తల హడావిడి మొదలైంది. అయితే ఈవార్తలు మహేష్ దృష్టి వరకు వెళ్ళడంతో మహేష్ స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి తాను ‘మా’ సంస్థ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తప్పకుండా అమెరికా వెళతానని చెపుతూ ఈలోపున చిరంజీవి తన పెద్దరికంతో ‘మా’ సంస్థ వివాదాలకు ఒక ముగింపు పలికేలా రాజీ మార్గం ఆలోచించమని కోరినట్లు సమాచారం.

ఈవిషయంలో మహేష్ చూపిస్తున్న శ్రద్ధకు చిరంజీవి ఎంతో ఆనంద పడటమే కాకుండా తాను తప్పకుండా ఈ వివాదానికి ఒక ముగింపు పలకడానికి శివాజీ రాజా నరేశ్ ల వర్గాలతో చర్చలు జరుపుతానని మహేష్ కు భరోసా ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ నేపధ్యంలో నరేశ్ కోరిన విధంగా ‘మా’ వివాదానికి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయాలా లేదంటే ఇండస్ట్రీ పెద్దలతో ఒక సమావేశం నిర్వహించి ఈవివాదానికి ఒక ముగింపు పలకాలా అన్న ఆలోచనలలో చిరంజీవి ఉన్నట్లు సమాచారం. 

గతంలో ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ మహేష్ చిరంజీవి సినిమాలలో నటించినా నటించకపోయినా ఎప్పటికీ చిరంజీవి మాత్రమే నెంబర్ వన్ అంటూ కామెంట్ చేయడమే కాకుండా మెగా స్టార్ స్థానాన్ని మరెవ్వరూ చేరుకోలేరు అన్న కామెంట్స్ చేసి మెగా అభిమానులకు మహేష్ బాగా దగ్గర అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ‘మా’ వివాదంలో మహేష్ తనంతట తానుగా రంగంలోకి దిగి చిరంజీవి పెద్దరికాన్ని కోరడంతో ఈ వ్యవహారం మరికొన్ని రోజులలో ఒక పరిష్కారానికి వచ్చే ఆస్కారం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: