పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం కేవలం మూడు సినిమాలతోనే విజయ్ దేవరకొండ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఏకంగా స్టార్ హీరోలే అతన్ని స్టార్ అంటూ పిలవడం మొదలు పెట్టారు. రీసెంట్ గా రిలీజ్ అయిన గీతా గోవిందం సినిమా స్టార్ హీరోలకు సైతం షాక్ ఇచ్చేలా 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో దూసుకెళ్లింది. 


ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్న సినిమా నోటా. ఆనంద్ రంగ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితమే కోలీవుడ్ హీరో సూర్య తన ట్విట్టర్ లో రిలీజ్ చేశారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో విజయ్ సిఎంగా నటిస్తున్నాడు.


ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. ఆడడం మొదలు పెట్టావో.. ఆపడం నీ చేతుల్లో ఉండదు. ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని.. డైలాగ్స్ బాగా పేలాయి. సత్య రాజ్, నాజర్ సినిమాలో ప్రముఖ పాత్రల్లో కనిపిస్తున్నారని తెలుస్తుంది. తెలుగులో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న విజయ్ ఈ సినిమాతో తమిళంలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు.


కె.యి జ్ఞానవెల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకు సామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తుండగా. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే విజయ్ మళ్లీ తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ అందుకునేలా ఉన్నాడు. ట్రైలర్ లో అతని యాటిట్యూడ్ వేరియేషన్స్ చూసి షాక్ అవ్వాల్సిందే. అక్టోబర్ 4న రిలీజ్ అవబోతున్న ఈ నోటా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: