ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.  ఈ సినిమాతో రాంచరణ్ ఏకంగా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరారు.   ఇంత మంచి సక్సెస్ అందుకున్న రాంచరణ్ తన తర్వాత చిత్రం కూడా భారీ స్థాయిలో ఉండాలనే ఉద్దేశ్యంతో..మాస్ దర్శకులు బోయపాటి శ్రీనివాస్ ని ఎంచుకున్నారు.  ప్రస్తుతం వీరిద్దరి కాంబినేష్ లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ చిరు పుట్టిన రోజు వస్తుందని భావించారు..కానీ రాలేదు..ఆ తర్వాత బాబాయ్ పుట్టిన రోజుకైనా రిలీజ్ చేస్తారని భావించారు అభిమానులు..కానీ మరోసారి నిరాశపరిచాడు చెర్రీ.

అంతే కాదు  ఈ చిత్రానికి సంబంధించి ఏ ఒక్క లీక్ కూడా ఇవ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు.   ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరేసియాలోని 'అజర్ బైజాన్' లో జరుగుతోంది. చరణ్ .. వివేక్ ఒబెరాయ్ తదితరులపై ఒక యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు.  ఈ చిత్రానికి ఇదే హైలెట్ సీన్ అని అంటున్నారు.  తాజాగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తన ట్విట్టర్ లో రాంచరణ్ ని తెగ పొగిడేస్తూ ట్వీట్ చేశారు. 

'అజర్ బైజాన్' దేశం పౌరుషానికి ప్రతీక .. అలాంటి దేశంలో ఈ సినిమా షూటింగు జరుగుతూ ఉండటం ఆనందంగా వుందని అన్నారు.   డైరెక్టర్ బోయపాటి టేకింగ్ చాలా అద్భుతంగా ఉందని అన్నారు.  ఇక తన సహనటుడు రాంచరణ్ ని అయితే ఆకాశానికి ఎత్తేశారు.  రాంచరణ్ లో ఎనర్జీ చూస్తుంటే..తోటి నటులకు కూడా ఎంతో ఉత్సాహం కలుగుతుందని..అంతగొప్ప యాక్టీవ్ పర్సన్ ని నేను ఎక్కడా చూడలేదని అన్నారు.  ఒక్కమాటలో చెప్పాలంటే సీట్ ఎడ్జ్ పై కూర్చుని ఎంజాయ్ చేయవలసిన సినిమా ఇది .. ఎదురుచూస్తూ వుండండి' అంటూ ట్వీట్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: