ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపిడేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాత సోలో హీరోగా పలు చిత్రాల్లో నటించాడు.  కానీ పెద్దగా సక్సెస్ కాలేదు.  ఇక స్వామిరారా చిత్రం నుంచి మనోడి జాతకం మొత్తం మారింది.  వరుసగా కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికిపోతావు చిన్నవాడ, కేశవ లాంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నాడు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన కెరియర్ కి సంబంధించిన కొన్ని సంచలన విషయాలు తెలిపాడు. 

Image result for nikhil hero

 2007లో వచ్చిన 'హ్యాపీ డేస్' ద్వారా ఒక నటుడిగా నేను జనానికి తెలిశాను. సినిమా ఇండస్ట్రీలో నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు .. గాడ్ ఫాదర్స్ లేరు. కేవలం శేఖర్ కమ్ముల మంచితనం వలన .. ఆయన వ్యక్తిత్వం కారణంగా నాకు 'హ్యాపీ డేస్'లో ఛాన్స్ వచ్చిందని అన్నాడు. కెరీర్ బిగినింగ్ లో నాకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు లేరు..ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా వచ్చాను..కనుకనే చాలా సినిమాలు తొందరపడి ఒప్పుకున్నాను.  వరుసగా అపజయాలు కలగడంతో అసలు ఇండస్ట్రీలో నేను ఉంటానా అన్న డౌట్ కూడా వచ్చింది.  

Image result for nikhil hero

నేను చేసిన పొరపాట్ల నుంచే నేను పాఠాలు నేర్చుకోవలసి వచ్చింది. అందువలన కెరియర్ మొదట్లో చాలా ఫ్లాప్స్ పడ్డాయి. నాకు అవగాహన వచ్చిన దగ్గర నుంచి మంచి సినిమాలు చేస్తూ వెళుతున్నాను" అని చెప్పుకొచ్చాడు. అందరు యువ హీరోలకు చిరంజీవి ఆదర్శం..అంటారు..అవును నాకు కూడా మెగాస్టార్ అంటే పిచ్చి అభిమానం..ఆయన చిత్రాలు చూస్తే పెరిగాను.  చిరంజీవిగారి 'గ్యాంగ్ లీడర్' సినిమా చూసినప్పుడే హీరోను కావాలని అనుకున్నాను.


మనసులోని ఆ కోరిక నాతో పాటు పెరుగుతూ వచ్చింది. 'హ్యాపీడేస్' సినిమా సమయానికి ఒక్కసారి తెరపై కనిపించినా చాలు అని ఆశ పడ్డాను. ఆ తరువాత సోలో హీరోగా చేస్తే బాగుంటుందని అనుకున్నాను .. 'యువత' సినిమా చేశాను. నాకు మంచి సక్సెస్ ఇచ్చింది..స్వామిరారా..అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పొచ్చు.  ఛారిటీకి సంబంధించిన ఈవెంట్స్ ను నేను ఫ్రీగా చేస్తాను .. కమర్షియల్ ఈవెంట్స్ అయితే డబ్బు తీసుకునే చేస్తాను. నేనే కాదు ఏ హీరో, హీరోయిన్ అయినా అలాగే చేస్తారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: