జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ వినాయక్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘అదుర్స్’ అప్పట్లో సూపర్ హిట్ మూవీ. ఈమూవీలో జూనియర్ బ్రహ్మానందంల కామెడీకి అప్పట్లో ప్రేక్షకులు తెగ నవ్వుకున్నారు. ఈమూవీకి సీక్వెల్ తీయాలని ఆలోచనలు చేసినా ఆ ఆలోచనలు క్రియా రూపం దాల్చలేదు. అయితే వినాయక్ తీరని కోరికను దసరాకు విడుదల కాబోతున్న ‘అరవింద సమేత’ తీర్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
Jr NTR in Aravinda Sametha
ఈమూవీలో జూనియర్ సునీల్ ను గురువు గారు గురువు గారు అంటూ ఎప్పుడూ సునీల్ చుట్టూ తిరుగుతూ అద్భుతమైన కామెడీ చేస్తాడట. ఈ సీన్స్ చూసిన వారికి వెంటనే ‘అదుర్స్’ సినిమాలోని బ్రహ్మనందం జూనియర్ ల కామెడీ సీన్స్ వెంటనే గుర్తుకు వస్తాయి అని అంటున్నారు.  
Trivikram ,Sunil ,comedianm,NTR in Aravinda Sametha,NTR ,NTR and Trivikam,
తెలుస్తున్న సమాచారం మేరకు త్రివిక్రమ్ తన స్నేహితుడు సునీల్ కోసం ‘అరవింద సమేత’ లో క్రియేట్ చేసిన సునీల్ క్యారెక్టర్ ఈసినిమాకు సంబంధించిన 90శాతం సీన్లలో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆఖరికి ఒక డ్యూయట్ లో కూడా జూనియర్ తో కలిసి కనిపిస్తాడు అంటే సునీల్ పాత్రను ఈమూవీలో ఎంత కీలకంగా మార్చాడో అర్థం అవుతుంది. 
Comedian turned actor - Sunil
ప్రస్తుతం హీరోగా సునీల్ కెరియర్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఈరోజు విడుదల అవుతున్న ‘సిల్లీ ఫెలోస్’ పై కూడ అంచనాలు లేవు. ఇలాంటి పరిస్థుతులలో ‘అరవింద సమేత’ ఘన విజయం త్రివిక్రమ్ జూనియర్ ల కంటే సునీల్ కు మరింత కీలకంగా మారింది. సునీల్ తిరిగి కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న నేపధ్యంలో ఈమధ్య బ్రహ్మానందం మాట్లాడుతూ ఒకసారి సునీల్ ట్రాక్ లోకి వస్తే ఇప్పటి టాప్ కమెడియన్స్ ప్యాకప్ అయిపోవాలి అన్న కామెంట్స్ ను బట్టి సునీల్ కమెడియన్ రీ ఎంట్రీ గురించి ఇండస్ట్రీ ఎంత కీలకంగా పరిశీలిస్తుందో అర్ధం అవుతుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: