ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.  సినీ, రాజకీయ,క్రీడా నేపథ్యంలో ఇప్పటి వరకు బయోపిక్ చిత్రాలు వచ్చాయి. అలనాటి మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా ‘మహానటి’ చిత్రం తెరకెక్కించారు.  ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటనకు జనాలు నీరాజనాలు పలికారు.  ఇక బాలీవుడ్ లో కాంట్రవర్సీ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ కూడా అద్భుతమైన విజయం అందుకుంది. ఇక సంజయ్ దత్ గా రణ్ బీర్ కపూర్ నటించాడు. 

మొత్తానికి  బయోపిక్ లు విశేషమైన ఆదరణ పొందడం .. భారీ వసూళ్లను రాబట్టడం వలన, కొత్తగా సెట్స్ పైకి వెళ్లే బయోపిక్ ల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.  తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కబీర్ ఖాన్ దర్శకత్వంలో బాలీవుడ్లో కపిల్ దేవ్ బయోపిక్ ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 1983 లో భారత దేశం గర్వించే విధంగా  ఇండియన్ క్రికెట్ టీమ్ తొలిసారిగా ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఈ విజయంలో కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ముఖ్యమైన పాత్రను పోషించారు.

 శ్రీకాంత్ మంచి బౌలర్..అప్పట్లో క్రికెట్ లో తన బౌలింగ్ తో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేవాడు. కాగా, కపిల్ దేవ్ పాత్రకు రణ్ వీర్ సింగ్ ను ఎంపిక చేసుకున్నారు. ఇక కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రకి గాను బన్నీతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ సినిమాకి '83' అనే టైటిల్ ను ఖరారు చేశారు. బన్నీ ఓకే అంటే ఆయన బాలీవుడ్ లో చేసే మొదటి సినిమా ఇదే అవుతుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: