ఈ మద్య తెలుగు లో వస్తున్న హిట్ చిత్రాలు తమిళ్ లో..తమిళ్ లో వస్తున్న హిట్ చిత్రాలు తెలుగు లో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్, కాజల్ కాంబినేష్ లో వచ్చిన ‘టెంపర్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.   ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రోహిత్ శెట్టి దర్శకత్వంలో  రన్ వీర్ సింగ్ హీరోగా ‘సింబ’ టైటిల్ తో  తీస్తున్నారు.
Image result for temper movie remake in hindi
ఈ చిత్రంలో చివరగా వచ్చే కోర్టు సీన్లు చాలా అద్భుతంగా ఉండటంతో ‘టెంపర్’ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం అయ్యింది.  ఇక తమిళ్ లో  విశాల్ హీరోగా చేస్తున్నాడు. 'ఠాగూర్' మధు నిర్మిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది.ఈ సినిమా ద్వారా వెంకట్ మోహన్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. షూటింగుకి ముందు .. కథలోను .. కొన్ని సన్నివేశాల్లోను మార్పులు చేద్దామని విశాల్ తో దర్శకుడు చెప్పాడట. 

అయితే అందు లో ఉన్న పాత్రల్లో మార్పులు చేర్పులు చేయడం వల్ల తనకేమీ ప్రాబ్లమ్ లేదని..కాకపోతే ఎన్టీఆర్ పాత్రలో మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు తీసుకు రావొద్దని విశాల్ సూచించారట.  ఆ సినిమాను నిలబెట్టింది ఆయన క్యారెక్టరైజేషనే అని గట్టిగానే చెప్పాడట. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఆయనకి అక్కడ హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: