తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి.  అప్పటికే తెలంగాణ ప్రజల గుండెల్లో టీఆర్ఎస్ పార్టీ మంచి స్థానం సంపాదించింది.  ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాన వేసుకొని పోరాడిన కేసీఆర్ పై ఎంతో గౌరవం పెరిగింది.  ఇక ఎన్నికల్లో టీఆర్ఎస్ కి అత్యధిక మెజార్టీ రావడం..తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది.  రాబోయే ఎన్నికల కేసీఆర్ ప్రభుత్వం త్వరగా అడుగులు ముందుకు వేసింది.

నిన్న తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసింది.  అయితే కేసీఆర్ ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారని..ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూ విమర్శిస్తున్నారు.  తాజాగా తెలంగాణ అసెంబ్లీ రద్దుపై నటుడు మంచు మనోజ్ స్పందించాడు. కేసీఆర్, కేటీఆర్‌ల ఫొటోలను ట్వీట్ చేస్తూ.. టీఆర్‌ఎస్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాడు. ‘‘స్వయం పాలన కోసం ఏళ్లపాటు పోరాటం.. త్యాగాలతో ఏర్పాటు చేసుకున్న మొదటి శాసన సభను రద్దు చేయడం కొంచెం బాధగానే ఉంది.

కానీ, ఏదైనా సరే మంచి కోసమే. ప్రజల కోసం మీరు తప్పకుండా తిరిగి వస్తారని భావిస్తున్నా. ఈ మార్పును నమ్మనివారి ఆలోచన తప్పని మీరు నిరూపించారు. మీకు మరింత బలం చేకూరాలి’’ అని మనోజ్ ట్వీట్ చేశాడు. కాగా, మనోజ్ ట్వీట్‌పై మిశ్రమ స్పందన లభిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: