కొంతకాలం వరకు స్టార్ ద‌ర్శ‌కుల లిస్టులో అగ్రస్థానంలో కొనసాగిన  వినాయ‌క్ ప‌రిస్థితి ఇప్పుడు ఎవరికి అర్ధంకాని విషయంగా మారింది. ప్రస్తుతం అతడు అటు టాప్  హీరోలతో ఇటు మిడిల్ రేంజ్ హీరోలతో ఇలా ఎవరితోను సినిమాలు తీయలేని పరిస్థితులలో సతమతమవుతున్నాడు. ‘ఇంటిలిజెంట్’ సినిమాతో వినాయ‌క్ క్రేజ్ ప‌దిమెట్లు కింద‌కి దిగ‌జారింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.  
VV Vinayak Next Movie With Bellamkonda Srinivas
ప్రస్తుతం ఈమాస్ డైరెక్టర్ చేతిలో నంద‌మూరి బాల‌కృష్ణ మూవీ ప్రాజెక్ట్ ఉన్నా నిర్మాత సి. కళ్యాణ్ రెడీగా ఉన్నా బాలయ్యకు స‌రైన క‌థ మాత్రం సెట్ చేయ‌లేక‌పోతున్నాడు అన్నవార్తలు వస్తున్నాయి.  దీనికికారణం వినాయక్ లోని బలహీనత అని అంటున్నారు. వాస్తవానికి వినాయక్ క‌థ‌కుడు కాదు త‌న క‌థ‌ల్ని తానే సొంతంగా త‌యారు చేసుకోలేడు. ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్న దర్శకులు అంతా తమ సినిమాలకు సంబంధించి కధలను తామే తయారు చేస్కుంటూ ఉంటే వినాయ‌క్ తన సినిమాలకు సంబంధించిన కథ విషయంలో మరోవ్యక్తి పై ఆధారపడ వలసిన పరిస్థితి. వినాయక్ ఫామ్‌లో ఉన్న‌ప్పుడు తాను ఏక‌థ ప‌ట్టుకున్నా హిట్ అయి కూర్చునేది  అందువల్ల సమస్యలు వచ్చేవికాదు. 

అయితే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారడంతో క‌థ‌ల‌తోనే అస‌లు స‌మ‌స్య వినాయక్ కు  వ‌స్తోంది. ఆకుల శివ లాంటి ఆస్థాన ర‌చ‌యిత‌లు వినాయక్ కు ఉన్నప్పటికీ ఈమ‌ధ్య అతడు వినాయక్ కు అందించిన  క‌థ‌ల‌న్నీ బెడ‌సి కొట్ట‌డంతో ఈమాస్ డైరెక్టర్ కు మరో ఊహించని సమస్యగా మారింది అనిఅంటున్నారు. దీనితో కొత్త రచయితలను పిలిచి  క‌థ‌లు వింటున్నా అవేం వ‌ర్క‌వుట్ అవ్వ‌డం లేదు అని టాక్. మ‌రోవైపు సి. క‌ల్యాణ్ కూడా వినాయ‌క్ పై కాస్త అసంతృప్తితో ఉన్నడనే వార్తలు వస్తున్నాయి. 

బాలకృష్ణ రెడీ చెప్పినా క‌థ రెడీ కాక‌పోవ‌డంతో మ‌రో ద‌ర్శ‌కుడ్ని వెతుక్కోవాల‌ని నిర్మాత కళ్యాణ్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు బాల‌య్య బోయ‌పాటి సినిమా త్వ‌ర‌లో ప్రారంభం ఆయీ స్పష్టమైన సూచనలుకనిపిస్తున్నాయి. దీనితో  వినాయ‌క్ క‌థ సెట్ చేస్తే ఓకే లేదంటే బాలయ్య బోయ‌పాటి సినిమాకే సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా మారే అవ‌కాశాలున్నాయ‌ని ఇండస్ట్రీ వర్గాలలో గాస్సిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఏది ఏమైనా మారిన కాలంతో వేగంగా వినాయక్ మారలేకపోతున్నాడు అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: