అక్కినేని మూడవతరం వారసుడు అఖిల్ లేటెస్ట్ మూవీకి  టైటిల్ ని కంఫర్మ్ చేశారు. మిష్టర్ మజ్ఞూ పేరు ఆ మూవీకి ఓకే చేశారు. ఇంతవరకూ వర్కింగ్ టైటిల్ గా ఉన్న ఆ పేరే చివరకు కంఫర్మ్ కావడం విశేషం. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.



అక్కినేని వంశానికి మజ్ఞూ టైటిల్ అచ్చి వచ్చిన సంగతి  అందరికీ తెలిసిందే. లైలా మజ్ఞూ లో మజ్ఞూగా అక్కినేని నాగేశ్వరరావు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత 1987లో దాసరి నారాయణ రావు డైరెక్షన్లో అక్కినేని నాగార్జున మజ్ఞూగా వెండితెరను పండించారు. ఈ మూవీలో ఆయనకు జోడీగా రజని నటించి హిట్ పైర్ అనిపించుకుంది.



ఇక అఖిల్ కూడా ఆ సెంటిమెంట్ టైటిల్ తో ముందుకు రావడం పట్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రేమ కధా చిత్రాలకు అక్కినేని వంశం పెట్టింది పేరు. దేవదాస్, మజ్ఞూ లాంటి టైటిల్స్ నప్పేది, జనం అందులో మెచ్చేది వాళ్ళనే.  మిష్టర్  మజ్ఞూ మూవీలో అఖిల్ పక్కన హాటెస్ట్ బ్యూటీ  రష్మిక  జోడీగా నటిస్తోంది.


గీతా గోవిందం లాంటి సెన్సేషనల్ హిట్ మూవీలో నటించి మంచి వూపు మీద ఉన్న రష్మిక అఖిల్ జోడీ సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ మూవీ అఖిల్ ని ట్రాక్ లో పెడుతుందని అంతా నమ్ముతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: