దసరా సీజన్ దగ్గరకు వస్తున్న నేపధ్యంలో ఈసీజన్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న 'అరవింద సమేత' ప్రమోషన్ కు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రాబోతున్న ఈమూవీకి ఏర్పడ్డ అంచనాలకు అనుగుణంగా అత్యంత భారీస్థాయిలో ఈమూవీ ఆడియో ఫంక్షన్ ను సెప్టెంబర్ 20వ తారీఖున  హైదరాబాద్ లోని నోవోటెల్ హోటల్ లో నిర్వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈమూవీ దర్శక నిర్మాతలు త్రివిక్రమ్ రాథాకృష్ణలు వ్యూహాత్మకంగా బాలకృష్ణతో చేసినరాయబారం సఫలం కావడంతో ఈమూవీ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా బాలకృష్ణ రావడం ఇంచుమించు ఖాయం అని అంటున్నారు. ఈమూవీలోని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి  రామజోగయ్య శాస్త్రి చాల అద్భుతంగా రాయడంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈపాటలకు ఇచ్చిన ట్యూన్స్ చాల క్యాచీగా ఉన్నాయని ఇప్పటికే ఈపాటలు విన్నవారు కామెంట్ చేస్తున్నట్లు టాక్. 
Vijay Deverakonda,Vijay Deverakonda NOTA,Vijay Deverakonda movie
ఇది ఇలా ఉండగా ఈమూవీ విడుదలకు కేవలం ఒక్కవారం ముందుగానే విడుదలకాబోతున్న విజయ్ దేవరకొండ ‘నోటా’ మూవీకి ఏర్పడ్డ క్రేజ్ ను కూడ పరిగణలోకి తీసుకుని ‘అరవింద సమేత’ పబ్లిసిటీ స్ట్రాటజీని డిజైన్ చేస్తున్నట్లు టాక్. ‘గీత గోవిందం’ తో టాప్ హీరోల స్థాయికి చేరిపోతాడా అన్న సందేహాలు కలిగించిన విజయ్ దేవరకొండ తనకు తానే పరీక్ష పెట్టుకుంటున్నట్లుగా ‘అరవింద సమేత’ మ్యానియాను లెక్కచేయకుండా అతడు కూడ దసరా రేసును టార్గెట్ చేస్తూ వస్తున్న నేపధ్యంలో ఒకవిధంగా ఈఏడాది దసరా రేస్ జూనియర్ విజయ్ ల అనుకోని వార్ గా మారింది.
Actor called up his uncle after returning from Spain and apparently apologised for their differences.
‘నోటా’ ద్వారా తమిళ రంగంలో అడుగుపెట్టడానికి విజయ్‌ ప్రయత్నిస్తున్న నేపధ్యంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఉన్న ఈమూవీ కూడ తెలుగు తమిళ భాషలలో విజయం సాధిస్తే ఇక విజయ్ దేవరకొండకు ఎదురు ఉండదు.  అయితే యూత్‌ అదేవిధంగా  ఫ్యామిలీ ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడని పొలిటికల్ జోనర్ మూవీని ఎంచుకుని ఏకంగా జూనియర్ తో పోటీగా దిగడం అత్యంత సాహసంగా మారింది. ఇలాంటి పరిస్థుతులలో క్రేజీ హీరోస్థాయికి చేరిపోయిన విజయ్ దేవరకొండ మ్యానియాకు బాలకృష్ణ జూనియర్ లు కలిసి తమ ఐక్యతా రాగంతో ఎలాంటి చెక్ పెడతారో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: