రెండు రోజుల క్రితం ప్రభాస్ ‘జిల్’ రాథా కృష్ణ దర్శకత్వంలో మరొక సినిమాను మొదలు పెట్టినందుకు ప్రభాస్ అభిమానులు విపరీతంగా ఆనంద పడుతున్నారు. అయితే ఇండస్ట్రీలోకి కొందరుమాత్రం ప్రభాస్ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు అతడి కెరియర్ కు శాపంగా మారే ఆస్కారం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Prabhas
ఆసక్తికరమైన ఈకామెంట్స్ వివరాలలోకి వెళితే ప్రభాస్ కూడ నిజంగా ఆలోచించవలసిన కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న కొందరి అభిప్రాయాల ప్రకారం ప్రముఖ హాలీవుడ్ స్టార్లు కూడ ఒక అత్యంత భారీసినిమాలో నటించి ఘనవిజయం అందుకున్న తరువాత తిరిగి అలాంటి భారీవిజయం గురించి ఎదురు చూడకుండా రెగ్యులర్‌ బడ్జెట్‌ సినిమాలు కూడా సమాంతరంగా చేశారనీ అయితే ప్రభాస్ మాత్రం తాను నటించే ప్రతిసినిమా బడ్జెట్ 'బాహుబలి' రేంజ్‌లో ఉండాలని ప్రయత్నిస్తూ తప్పటడుగు వేస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు.
Prabhas updated his Facebook cover with his latest look for Saaho. Photo: firdaus_prabhas_fan/Instagram
ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం కావడానికి గలకారణం మొన్న ప్రారంభం అయిన ప్రభాస్ జిల్ రాథా కృష్ణల మూవీ ప్రాజెక్ట్ కు ఏకంగా 150 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు పెట్టబోతున్నారు అని వార్తలు రావడం. ‘బాహుబలి’ తో వచ్చిన నేషనల్‌ వైడ్‌ మార్కెట్‌ని కాపాడుకోవడానికి తాను నటించే ప్రతి సినిమా భారీగా ఉండాలని ఆసినిమాలకు భారీ కాన్సెప్టులు బడ్జెట్టులు కేటాయిస్తూ అత్యంత భారీ సినిమాలను వరసగా తీయాలని ప్రభాస్ చేస్తున్న ప్రయత్నాలు మంచివి కావు అని కొందరి వాదన. 
Prabhas
అంతేకాదు ఇలాంటి అత్యంత భారీ బడ్జెట్ సినిమాలను తీయాలని అభిప్రాయ పడినప్పుడు ఆమూవీ స్థాయికి తగిన పెద్ద దర్శకుడు అండపెట్టుకోవాలని అలా కాకుండా వందల కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘సాహో’ ని సుజిత్ లాంటి యంగ్ డైరెక్టర్ కు త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న మరో భారీ మూవీని రాథాకృష్ణ లాంటి మరో యంగ్ డైరెక్టర్ కు అప్పచెప్పి ప్రభాస్ అత్యంత సాహసం చేస్తున్నాడు అని ఈవిమర్శకుల అభిప్రాయం. అంతేకాదు ఈరెండు భారీ సినిమాల ఫలితాలలో ఏఒక్క సినిమా ఫలితం తేడా వచ్చినా దాని వల్ల ఈమూవీలను భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయి ఆఫలితాలు ప్రభాస్ కెరియర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపెట్టే ఆస్కారం ఉంది అంటూ కొందరు విమర్శకులు ప్రభాస్ ను హెచ్చరిస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: