తెలుగు ఇండస్ట్రీలో ‘అల్లరి’ చిత్రంతో దర్శకులుగా ఎంట్రీ ఇచ్చిన రవిబాబు తర్వాత నటుడిగా కూడా తన సత్తా చాటుతున్నారు.  విభిన్నమైన చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్న రవిబాబు ఆ మద్య ‘అదుగో’ సినిమాను అనౌన్స్ చేశాడు. నోట్ల రద్దు సమయంలో రవిబాబు పంది పిల్లను పట్టుకుని ఏటీఎం క్యూలో నిలబడి తన సినిమాను ప్రమోట్ చేశాడు.

ఆ తర్వాత ఈ చిత్రం రక రకాల కారణాల వల్ల వాయదా పడుతూ వస్తుంది. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ చిత్రం నుంచి  టీజర్ ను రిలీజ్ చేశారు.  ఈ టీజర్ పెట్టిన ఆరు గంటల్లోనే 2.50 లక్షల మంది దీన్ని వీక్షించారు. ఓ అమ్మాయి వాయిస్ ఓవర్ తో..  బంటి (పంది పిల్ల) చెప్పినట్టు చేయడం .. డాన్స్ కూడా చేసేయడం చూపించారు. ఈ టీజర్ చిన్నపిల్లలను ఆకట్టుకునేలానే వుంది.

కేవలం పంది పిల్లను మాత్రమే చూపిస్తూ టీజర్ ను కట్ చేసిన రవిబాబు, చిత్రంపై ఆసక్తిని పెంచడంలో సక్సెస్ అయ్యాడు.  దేశంలోని అన్ని భాషల్లో ‘బంటి’ పేరుతో ఈ చిత్రంను విడుదల చేస్తున్నారు. అయితే, ఈ చిత్రం ఎప్పుడు విడుదల కానుందనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం ట్రైలర్‌ను సెప్టెంబరు 12న విడుదల చేస్తామని ఈ వీడియో ద్వారా ప్రకటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: