తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ కాంబినేషన్ అంటే వెంటనే చెప్పేస్తారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకులు కొరటాల శివ.  వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీమంతుడు’,‘భరత్ అనే నేను’రికార్డుల మోత మోగించాయి.  అయితే  ‘భరత్ అనే నేనే’ చిత్రంలో  'ఐ డోంట్ నో' అంటూ సాగే ఈ పాటను బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ఆలపించారు. బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు, గాయకుడు ఫర్హాన్‌ అక్తర్‌ అన్ని రాంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఫర్హాన్ తాజాగా ప్రేమలో పడ్డాడని అంటున్నారు బాలీవుడ్‌ గాసిప్‌ వర్గాలు. అయితే తాను ఎవరి ప్రేమలో పడ్డాడో..హింట్ ఇచ్చి మరీ సంచలనం రేపాడు ఫర్హాన్‌ అక్తర్‌. 
Image result for farhan akhtar sibani dandekar
కాగా, ఈ హీరో ప్రేమలో పడిన ముద్దుగుమ్మ మరెవరో కాదు... ఐపీఎల్‌ యాంకర్‌గా తన హాట్‌నెస్‌తో కుర్రకారుకి గిలిగింతలు పెట్టిన షిబానీ దండేకర్‌.  మూడు పదులు దాటిన ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా మంచి ఫిట్ నేస్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. అంతే కాదు టాప్ హీరోయిన్లకు దిమ్మతిరిగేలా..బికినీల్లో, రివీలింగ్‌ బట్టల్లో ఫోజులిస్తూ నిత్యం అభిమానులు తన సోషల్‌ మీడియా పేజ్‌లు పట్టుకు వేలాడేలా చేస్తుంది.  
Image result for farhan akhtar sibani dandekar
అయితే ఇప్పటికే మొదటి భార్యతో విడాకులు పొందిన ఫర్హాన్‌ గత రెండేళ్లుగా ఈమెతో రిలేషన్‌లో వున్నాడట.  మరి భవిష్యత్ లో ఈ జంట పెళ్లి చేసుకుంటారా..లేక డేటింగ్ తోనే సరిపెట్టుకుంటారా అన్నది భవిష్యత్ లో తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: