టాలీవుడ్ లో ఇప్పటి వరకు  ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ లాంటి మంచి  సినిమాలను నిర్మించిన సురేష్ కొండేటి  మరో చక్కటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మ‌హాన‌టి ఫేం దుల్క‌ర్ స‌ల్మాన్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం ఉస్తాద్ హోట‌ల్‌. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి తెలుగులో జ‌న‌తా హోట‌ల్ పేరుతో సెప్టెంబ‌ర్ 14న విడుద‌ల చేయ‌బోతున్నాడు.
janatha hotel,1st teaser,released  ‘జనతా హోటల్’ మొదటి టీజర్ వదిలారు
మూవీకి సంబంధించిన టీజ‌ర్స్ ని రోజుకొక‌టి చొప్పున విడుద‌ల చేయాల‌ని భావించారు. ఇందులో భాగంగా తొలి టీజ‌ర్ విడుద‌ల చేశారు.  ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న సురేష్ కొండేటి.. ఈ సినిమా విషయంలో మరింత వైవిధ్యాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నారు. మరో 7 రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రోజుకో టీజర్ చొప్పున ఏడు రోజుల పాటు విడుదల చేయనున్నారు. 

 ఇక సినిమా విషయానికి వస్తే.. తన కుటుంబానికి వారసుడు కావాలనుకున్న ఓ తండ్రికి వరుసగా నలుగురు ఆడపిల్లలకు పుట్టడం.. అయినా ఆశ చంపుకోని అతడికి ఎట్టకేలకు ఐదో సంతానంగా మగ పిల్లాడు పుట్టడం.. ఆ పిల్లవాడు తండ్రికి నచ్చింది కాకుండా.. తనకు నచ్చింది చేయడం.. చివరికి పెళ్లి చూపుల్లో తన క్వాలిఫికేషన్ గురించి అమ్మాయి అడిగితే.. తాను విదేశాలకు వెళ్లి చదివింది చెఫ్ కోర్సు మాత్రమేనని చెప్పడం.. ఇలా ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తున్న సన్నివేశాలతో టీజర్ ఆకట్టుకుంటోంది. ఇలా పలు ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో టీజ‌ర్‌ని రూపొందించి విడుద‌ల చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: