సినిమాలకు దూరంగా ప్రస్తుతానికి రాజకీయాలు తప్ప మరో ధ్యాస లేకుండా అడుగులు వేస్తున్న పవన్ ఆలోచనలలో వచ్చిన మార్పులకు అతడి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కారకుడు అన్నవార్తలు వస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమాలలో నటించబోతున్నాడు అంటూ గతకొంత కాలంగా వార్తలు హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. 
Pawan Kalyan
అయితే ఇప్పుడు తెలుస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం వైష్ణవ్ తేజ్ నటించే తొలి మూవీని పవన్ కళ్యాణ్ నిర్మిమించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అతడి సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ పై ఈమూవీని పవన్ కు అత్యంత సన్నిహితుడైన రామ్ తాళ్ళూరితో కలిసి నిర్మిమిస్తాడని తెలుస్తోంది. 

పవన్ కు సన్నిహితుడు మాత్రమే కాకుండా ‘జనసేన’ పార్టీలో అత్యంత కీలక వ్యక్తిగా పేరు తెచ్చుకున్న రామ్ తాళ్ళూరి ఈమధ్య రవి తేజాతో ‘నేల టిక్కెట్’ మూవీని నిర్మించాడు. అయితే ఆమూవీ ఫెయిల్ అయింది. ఇప్పుడు మళ్ళీ రామ్ తాళ్ళూరి ఆనష్టాల నుండి బయట పడటానికి పవన్ వైష్ణవ్ తేజ్ రూపంలో సహాయం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమూవీకి పవన్ కు ఎంతో ఇష్టమైన దర్శకుడు డాలి దర్శకత్వం వహించబోతున్నాడని  వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసుకుంటున్న ఈమూవీలో రాజకీయ నేపధ్యంలో ఉండే ఒక పవర్ ఫుల్ పాత్ర ఉందట. 
pawan kalyan fans
ఈమూవీ కథకు అత్యంత కీలకంగా ఉండే ఈపాత్రను పవన్ కళ్యాణ్ చేత నటింప చేయాలని డాలి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పవన్ ఈమూవీలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తే మార్కెట్ పరంగా కోట్లు కురుస్తాయి కాబట్టి నిర్మాత రామ్ తాళ్ళూరి కూడ డాలి ఆలోచనలను సమర్ధిస్తూ పవన్ పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికల లోపే ఈమూవీని విడుదల చేసి పవన్ అభిమానులకు షాక్ తో జోష్ ను ఇవ్వాలని జరుగుతున్న ప్రయత్నాలకు పవన్ అంగీకారం ఎంత వరకు లభిస్తుందో చూడాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: