బిగ్ బాస్ లో ప్రతి వారం ఎలిమినేషన్ కంపల్సరీ.. శని, ఆదివారాల్లో నాని సరదా హోస్టింగ్ తో పాటుగా నామినేషన్, ఎలిమినేషన్ అంటూ హడావిడి చేస్తాడు. ప్రతి వారం లానే ఈ వారం కూడా బిగ్ బాస్ ఎలిమినేషన్ ఉంటుంది. అయితే ఎప్పుడు శని వారం ఎవర్నో ఒకరిని సేఫ్ జోన్ లోకి పంపించే నాని ఈసారి నామినేషన్ లో ఉన్న నలుగురిని ఇబ్బందిలో పెట్టాడు.   


కౌశల్, అమిత్, దీప్తి, శ్యామలా ఈ నలుగురు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈసారి ఎలిమినేట్ అయ్యేది శ్యామలా అని అందరు అంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే శ్యమలా మరోసారి బిగ్ బాస్ హౌజ్ వీడే టైం దగ్గరకు వచ్చినట్టు తెలుస్తుంది. రీ ఎంట్రీలో శ్యామలా ఎనర్జీ బాగున్నా బయటకు వెళ్లొచ్చింది కాబట్టి పరైస్థితులను అంచనా వేస్తుంది.


అంతేకాదు నూతన్ నాయుడు, కౌశల్ విషయంలో ఆమె చూపించిన చొరవ ఒకరకంగా కౌశల్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలా చేసింది. అందుకే ఈ వారం కౌశల్ ఆర్మీ శ్యామల మీద పగ తీర్చుకున్నారని తెలుస్తుంది. కౌశల్ ఎలాగు సేఫ్ అవుతాడు. అమిత్, దీప్తిలకు మరో ఛాన్స్ ఇస్తూ శ్యామలా ఈరోజు బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వస్తుందట.


రీ ఎంట్రీలో లాభాలున్నాయి కాబట్టి ఆమెకు టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం లేదు. ఇక మిగిలిన రెండు వారాల్లోనే టైటిల్ ఎవరు అన్నది ప్రకటిచాల్సి ఉంది. మరి ఈ టైంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరం చెప్పలేం. మొత్తానికి శనివారం నాని షో సరదా సరదాగా సందడి చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: