నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దేవదాస్ రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. కింగ్ నాగార్జునతో నాని కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమాలో దేవగా నాగార్జున, డాస్ గా నాని నటిస్తున్నారు.


ఇక ఈ సినిమాతో పాటుగా నాని మళ్లీరావా దర్శకుడు గౌతం తిన్ననూరి డైరక్షన్ లో జెర్సీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. స్పోర్ట్స్ బ్యాండ్ డ్రాప్ తో వస్తున్న ఈ సిన్మాలో నాని కొత్తగా కనిపిస్తాడని అంటున్నారు. ఇక మరో పక్క చంద్రశేఖర్ యేలేట్ డైరక్షన్ లో కూడా నాని ఓ మూవీ సైన్ చేశాడు. 


బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా పేరు తెచ్చుకున్న యేలేటి మనమంతా తర్వాత కొద్ది పాటి గ్యాప్ తో నానితో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో నాని పోలీస్ గా కనిపిస్తాడట. నాని కెరియర్ లో మొదటిసారి పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమా ఓ ప్రయోగాత్మకంగా ఉంటుందని తెలుస్తుంది. 


నాని కెరియర్ లో మొదటిసారి పోలీస్ గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కమర్షియల్ గా హిట్ కొట్టకున్నా చంద్రశేఖర్ యేలేటి సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఇప్పుడు నాచురల్ స్టార్ నాని కూడా యేలేటికి తోడయ్యాడు కాబట్టి కచ్చితంగా సినిమా అంచనాలను మించి ఉంటుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: