ఎన్నో ఆశలు పెట్టుకుని ‘బిగ్ బాస్ 2’ షోలో రీ ఎంట్రీ ఇచ్చిన యాంకర్ శ్యామల ఈవారం ఎలిమినేట్ కాబోతోంది అన్న స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. వాస్తవానికి ఈ షో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రసారం అయ్యేది ఆదివారం అయినా శనివారం నాడు దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి అవుతూ ఉండటంతో ముందుగానే వచ్చిన లీకులు ఇంచుమించు నిజం అవుతున్నాయి.
Anchor Syamala Comeback on Bigg Boss 2 House?
అయితే ఆశ్చర్యకరంగా శ్యామలకు ఓట్లు ఎక్కువ వచ్చినా ‘బిగ్ బాస్’ హోస్ నియమాలను ఆమె బ్రేక్ చేసింది అన్న కారణంతో ఆమెను ఈ షో నుండి బయటకు పంపుతున్నట్లు సమాచారం. గతవారం ఇదే కారణంతో నూతన నాయుడుని కూడ ఎలిమినేట్ చేసారు. 
Anchor Syamala Biography 
వాస్తవానికి శ్యామలకు అమిత్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినా శ్యామలను తప్పించడంలో గల కారణం ఆమె పట్ల బిగ్ బాస్ కు ఏర్పడ్డ ఆగ్రహం అని అనుకోవాలి. ఈమె ఎలిమినేషన్ తరువాత ఇంకా ‘బిగ్ బాస్’ హోస్ లో ఏడుగురు కంటెస్టంట్స్ మిగిలి ఉండటంతో ఈ నేలాఖరి లోపు మరొకసారి డబల్ ఎలిమినేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 

ఈ షోకు సంబంధించి ఈవారం పోల్ అయిన ఓట్లు మూడు కోట్లు దాటాయి అని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు ‘బిగ్ బాస్ 2’ షో అంచనాలను అందుకోవడం లేదు అని ప్రచారం జరుగుతూ ఉంటే కొట్లలో పోల్ అవుతున్న ఈ ఓట్ల సంఖ్యను చూసి బుల్లితెర మీడియా వర్గాలు షాక్ అవుతున్నాయి. అందరి ఊహలకు షాక్ ఇస్తూ మహిళల మెప్పు కోసం ఈసారి ‘బిగ్ బాస్ 2’ విజేతగా సింగర్ గీతా మాధురిని ప్రకటించినా ఆశ్చర్యం లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: