జయచిత్ర డెబ్బై దశకం నాటి హీరోయిన్. అప్పట్లో జయ పేరు మీద వచ్చిన తారలంతా తారాపధంలో దూసుకుపోయారు. జయచిత్ర కూడా ఆ వరసలోనే హిట్లు కొడుతూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆమె తల్లి అమ్మజీ  కూడా నటీమణే. తెలుగులో దైవబలం మూవీలో అన్న నందమూరి పక్కన యాక్ట్ చేశారు.  చిత్రంగా జయచిత్ర కూడా మా దైవం మూవీలో అదే నందమూరికి హీరోయిన్ గా చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. 


జయచిత్ర పుట్టిన రోజు ఈ రోజు. ఆమె 1957 సెప్టెంబర్ 9న పుట్టారు. నిజానికి జయచిత్ర కుటుంబం తెలుగు వారే. కాకినాడ వారి సొంత వూరు. ఉద్యోగ వ్యవహారాల నిమిత్తం చెన్నై వెళ్ళిపోయారు. ఇక ఆరేళ్ళ వయసులొనే భక్త పోతన తెలుగు మూవీలో బాలనటిగా జయచిత్ర నటించి శభాష్ అనిపించుకుంది. ఆ తరువాత టీనేజ్ లో తమిళ్ లో ఎక్కువ మూవీస్ చేసిన ఆమె  తెలుగులో డి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ పై టాప్ హీరో శోభన్ బాబు తో తీసిన సోగ్గాడు లో ఆయనకు జంట గా నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. 



అక్కడ నుంచి తెలుగులో ఆమె విజయ యాత్ర సాగింది. అక్కినేని తో అత్మీయుడు,  క్రిష్ణతో  అన్నదమ్ముల సవాల్, క్రిష్ణంరాజు తో యవ్వనం కాటేసింది, మురళీ మోహన్ తో కల్పన వంటి చిత్రాలు చేసి టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. తరువాత కాలంలో నందమూరితో బొబ్బిలి పులి. బాలయ్య  సమరసిమ్హారెడ్డి వంటి సినిమాలలో  వాటిలో కనిపించి మెప్పించింది. అలనాటి తరం కధానాయిక జయచిత్రకు బర్త్ డే గ్రీటిన్స్ చెబుతూ అల్  ది బెస్ట్.



మరింత సమాచారం తెలుసుకోండి: