పవన్ కళ్యాణ్ లాంటి పాపులర్ హీరో పిలుపు ఇస్తే యూత్ పనులు మానుకుని రోడ్ల పైకి రావడం సర్వసాధారణ మైన విషయం. ‘బిగ్‌ బాస్’ కంటెస్టెంట్ కౌశల్ పిలవకుండానే అతడి అభిమానులు  ఈరోజు హైదరాబాద్‌ లో నిర్వహించిన 2కే రన్‌ కు సంబంధించిన వార్తలు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.  ఈఆదివారం ఉదయం 9 గంటలకు మాదాపూర్‌ లో మొదలైన ఈర్యాలీకి భారీ స్పందన లభించింది. వేలాది మందిగా ఈ వాక్‌కు తరలివచ్చారు.  
బాలనటుడిగా
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కౌశల్ అభిమానులు కౌశల్ ఆర్మీ పేరుతోఈ 2K ర్యాలీకి విపరీతమైన ప్రచారం చేసినా వచ్చిన స్పందన మాత్ర్రం ప్రచారానికి మించి ఉంది. ఈ 2K రన్ వార్తలు విని మీడియా వర్గాలు మాత్రమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు కూడ ఆశ్చర్య పోతున్నాయి.  

 2k ర్యాలీకి విశేష స్పందన

కౌశల్ బాలనటుడిగా టెలివిజన్ సిరీయల్‌ లో నటించిన నేపధ్యం ఉన్నా ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం రాజకుమారుడు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయినా ఆతరువాత కొన్ని సినిమాలలో ఇతడు నటించినా ఇతడు గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమానికి హోస్ట్‌ గా వ్యవహరించినా ఇతడి పేరు ‘బిగ్ బాస్ 2’ షో ప్రారంభం ముందు చాలామందికి తెలియదు.  

Bigg Boss telugu 2 Kaushal: Liked by his fans and hated by housemates (part-1)
అయితే కౌశల్ ‘బిగ్ బాస్ 2’ షోలోకి వెళ్లి తనదైన గేమ్ ఆట మొదలు పెట్టాక ఇప్పుడు అతడి అభిమానుల సంఖ్య లక్షల స్థాయిలో ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఈరోజు 
కౌశల్ ఆర్మీ 2k వాక్‌ కు వచ్చిన జనాన్ని  చూసి ఒక  రాజకీయ నాయకుడు పిలుపు ఇచ్చినా  స్పందన ఇంత భారీ స్థాయిలో ఉండదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ ర్యాలీ వెనుక కౌశల్ ప్రత్యక్ష ప్రమేయం కనిపించక పోయినా ఏదో ఒక అజ్ఞాత శక్తీ ఈరోజు ర్యాలీ విజయవంతానికి చాల తీవ్రంగా కృషి చేసింది అని అనిపించడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు జరిగిన 2k వాక్ తో కౌశల్ మ్యానియా మరింత పెరిగింది అని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: