ఆమె సౌందర్యం లోకాతీతం. అమె దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవ కన్య. తన అందాన్ని భూలోకానికి చూపించి అందమంటే ఇదీ అని అర్ధం చెప్పిన దేవత. వచ్చిన పని పూర్తి కాగానే తిరిగి తన దేవ లోకానికిఏ పయనమైన అప్సర ఆమే. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె అందాన్ని ఎలా వర్ణించినా తక్కువే. అటువంటి సౌందర్య రాశికి మరో ఘనమైన  గౌరవం దక్కబోతోంది


స్విట్జర్లాండ్‌లో శ్రీదేవి విగ్రహం


అందానికి అందమైన భారతీయ నటీమణి శ్రీదేవి విగ్రహాన్ని తమ దేశంలో నెలకొల్పాలని స్విట్జర్లాండ్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీదేవి నటించి సూపర్‌ హిట్‌ మూవీగా నిలిచిన చాందిని మూవీని ఇక్కడి సుందర ప్రదేశాల్లో తెరకెక్కించారు. అలా ఆమెకు అక్కడ అందమైన బంధం ఏర్పడింది. దానికి శాశ్వతం చేసుకోవాలని ఈ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారని భోగట్టా.  ఇక్కడ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు  విశ్వ‌సుందరి శ్రీదేవి విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. 


ఇంతకు ముందు అంటే 2016లో భారతీయ  సినీ దిగ్గజం యష్‌ చోప్రా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. యాష్‌ చోప్రా సినిమాల్లో అత్యధిక సినిమాలు స్విట్జర్లాండ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లోనే తెరకెక్కాయని, వీటి కారణంగా స్విట్జర్లాండ్‌కు భారత టూరిస్టులు పెరిగారని స్విస్‌ అధికారులు చెబుతున్నారు.  ఇపుడు శ్రీదేవి విగ్రహం ఏర్పాటుతో టూరిస్టులు వెల్లువలా వస్తారని నమ్ముతున్నారు.


ఇక తెలుగు వారికి గర్వ కారణమైన శ్రీదేవి నాలుగు దశాబ్ధాల పాటు తన అందంతో భారతీయ  వెండితెరను వెలిగించిన  సంగతి తెలిసిందే. శ్రీదేవి ఈ ఏడాది ఆరంభంలో దుబాయ్‌లోని ఓ హోటల్‌లో  ప్రమాదవశాత్తూ మరణించారు. ఆమె లేకపోయినా ఆమె విగ్రహం ఇపుడు స్విస్ దేశం నుంచి హెలో అంటుందన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: