బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకసారి బిగ్ బాస్ ఎలిమినేట్ అయ్యాక హౌజ్ లోకి రావడం కుదరదు కాని శ్యామలా, నూతన్ నాయుడులను రీ ఎంట్రీ ఇప్పించారు. మరో పక్క హౌజ్ లో అందరిది ఒక దారి అయితే కౌశల్ ఒక్కడిదే మరోదారి అయ్యింది.


అంతేకాదు బయట కౌశల్ ఆర్మీ అంటూ ఒకటి ఏర్పడి కౌశల్ కు సపోర్ట్ గా నిలుస్తుంది. సీజన్ మొత్తం కౌశల్ ను గీతా నామినేట్ చేయగా కౌశల్ ఆర్మీ సపోర్ట్ తో ప్రతి వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకుంటున్నాడు కౌశల్. బయట కౌశల్ ఆర్మీ ప్రభావం మరింత ఎక్కువైందని చెప్పొచ్చు. కౌశల్ గెలుపుని ఆశిస్తూ నిన్న హైదరాబాద్ లో కౌశల్ ఆర్మీ 2కే వాక్ చేశారు.


దీనికి అనూహ్యమైన స్పందన రావడం విశేష. గేం షోలో కంటెస్టంట్ కోసం ప్రేక్షకులు ఇలా 2కే వాక్ చేయడం అది కేవలం కౌశల్ ఒక్కడి వల్లే జరిగిందని చెప్పొచ్చు. వందల కొద్ది జనాలు కౌశల్ ఆర్మీ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక ఈ ర్యాలీ ప్రభావం చూస్తుంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్ కాకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఆలోచిస్తున్నారు.     


బిగ్ బాస్ కేవలం ఆడియెన్స్ ఓట్లతోనే నడిచే రియాలిటీ షో కౌశల్ ఆర్మీ వల్ల ఇప్పటివరకు కౌశల్ కే ఎక్కువ ఓట్లు వస్తూ ఉన్నాయి. ఈ టైంలో కౌశల్ ఆర్మీ చేసిన 2కే వాక్ కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అవాక్కయ్యేలా 2కే వాక్ జరిగింది. కచ్చితంగా కౌశల్ కే టైటిల్ ఇవ్వాల్సిందే లేదంటే పరిస్థితులు ఊహిచలేం అన్నట్టుగా ఉన్నాయి. మరి బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలి.      


మరింత సమాచారం తెలుసుకోండి: