‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీకి సంబంధించిన పాటను నిన్న హైదరాబాద్ లో చిత్రీకరించడం మొదలు పెట్టారు. జూనియర్ పూజా హెగ్డే తో కలిసి మరికొంతమంది డాన్సర్స్ తో కలిసి డాన్స్ చేసే ఈపాట చాల ఎనర్జిటిక్ గా ఉంటుందట. నిన్న ఉదయం షూటింగ్ స్పాట్ కు వచ్చిన జూనియర్ తన మనసులోని బాధను ఏమాత్రం బయటకు వ్యక్త పరచకుండా తన కుటుంబంలో ఎటువంటి విషాద సంఘటన జరగనట్లు ప్రవర్తిస్తూ జూనియర్ ఈపాటకు వేసిన స్టెప్స్ చూసి ఆనందంతో సంగీత దర్శకుడు తమన్ పెట్టిన ట్విట్ ఇప్పుడు జూనియర్ అభిమానుల మధ్య వైరల్ గా మారింది. 
S S Thaman,S S Thaman music, S S Thaman songs, vikram sai pallavi, virkram next film, vikram sai pallavi film, sai pallavi, premam sai pallavi, kollywood news, entertainment news
‘తారక్  అన్న నిన్న ఒక పాట షూటింగ్ లో పాల్గొన్నాడు. ఆయన సెట్స్‌లో డ్యాన్స్‌ చేస్తూ మళ్లీ ఎనర్జిటిక్‌గా కనిపించడం సంతోషాన్ని ఇచ్చింది. అన్నా మీరు మరింత దైర్యంగా ఉండాలి. ‘అరవింద సమేత’ మూవీ యూనిట్ మీపై అంతులేని ప్రేమను చూపిస్తోంది. ఆడియో అప్‌డేట్స్‌ వివరాలను ఈ వారం ఇస్తాం’ అని తమన్ తన ట్వీట్‌ లో పేర్కొన్నాడు.  ఇప్పుడు ఈ ట్విట్ జూనియర్ అభిమానుల మధ్య హాట్ న్యూస్ గా మారి అభిమానులు ‘ఎన్టీఆర్ అన్నా మీరు మళ్లీ మామూలు కావాలి మునుపటి ఉత్సాహాన్ని చూడాలనుకుంటున్నాం’ అంటూ అభిమానులు తమన్ ట్విట్ పై స్పందిస్తూ జూనియర్ కు రీ ట్విట్స్ చేస్తున్నారు. 
A still from the teaser
ఇది ఇలా ఉండగా ‘అరవింద సమేత’ ఆడియో ఫంక్షన్ గురించి అదేవిధంగా ఆ ఫంక్షన్ జరగబోయే డేట్ గురించి ఈరోజు ఒక ఫైనల్ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. అంతేకాదు బాలకృష్ణను ఈ మూవీ ఫంక్షన్ కు అతిధిగా పిలిచే విషయంలో ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవడానికి బాలయ్యకు అనుకూలమైన డేట్స్ తో పాటు ఎన్టీఆర్ బయోపిక్ షెడ్యూలు ఇలాంటివన్నీ తెలుసుకున్న తరువాత మాత్రమే ఈరోజు ఈమూవీ ఆడియో ఫంక్షన్ గురించి ఒక స్థిర నిర్ణయం వస్తుంది అని అంటున్నారు.  
Balakrishna Latest Stills in Paisa Vasool Movie
తెలుస్తున్న సమాచారం మేరకు కొందరు జూనియర్ సన్నిహితులు జూనియర్ కు మరో షాకింగ్ సలహా ఇచ్చినట్లు టాక్. జూనియర్ ఫంక్షన్ కు బాలకృష్ణ రావడం సంభవిస్తే మొత్తం మీడియా దృష్టి అంతా జూనియర్ బాలయ్యల కలయిక పై వెళ్ళిపోయి ‘అరవింద సమేత’ విషయాలు పక్కదారి పడతాయి కాబట్టి బాలకృష్ణను ఈమూవీ ఆడియో ఫంక్షన్ కు కాకుండా ఈమూవీ విడుదల అయ్యాక జరగబోయే సక్సస్ మీట్ కు పిలిస్తే అన్ని విధాల బాగుంటుంది అన్న సూచనలు కూడా జూనియర్ కు అందుతున్నట్లు సమాచారం. ఏది ఎలా ఉన్నా మరొక రెండు రోజులలో ‘అరవింద సమేత’ ఆడియో ఫంక్షన్ గురించి క్లారిటీ వచ్చే అవకాసం ఉంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: