టాలీవుడ్ లోకి అక్కినేని నాగార్జున వారసుడిగా ‘జోష్ ’ సినిమాతో పరిచయం అయిన అక్కినేని నాగ చైతన్య మొదటి సినిమా యాక్షన్ తరహాలో రావడం మైనస్ పాయింట్ అయ్యింది.  ఆ తర్వాత ఏం మాయ చేసావే లాంటి రొమాంటిక్ లవ్ స్టోరితో నాగచైతన్య లవర్ బాయ్ గా మారాడు.  ఈ సినిమాలో నటించిన సమంతనే రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకున్నాడు.  ప్రస్తుతం నాగ చైతన్య  హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శైలజా రెడ్డి’. మారుతి డైరెక్ట్  చేసిన ఈ మూవీలో చైతూ సరసన అను ఇమాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ

శైలజారెడ్డిగా రమ్యకృష్ణ పవర్ఫుల్ అత్త పాత్రలో నటించింది. ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈచిత్రానికి ఒక్క కట్ కూడా చెప్పకుండా సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చైతుకి జోడిగా అను అమ్మాన్యుయేల్ నటించగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ శైలజారెడ్డి పాత్రలో కనిపించనుంది.


ఒకప్పుడు గ్లామర్ డాల్‌గా వెలుగొందిన రమ్య ఇప్పుడు నేటి తరం గ్లామర్ డాల్స్‌కు తల్లి, అత్త పాత్రల్లో నటిస్తూ ఉంది. స్వతహాగా నటనాపటిమ ఉండటంతో ఇలాంటి పాత్రలను అవలీలగా చేసుకు వస్తోంది రమ్యకృష్ణ‌. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఆమె టైటిల్‌ రోల్‌లో నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా విడుదల కాబోతోంది. 


గోపి సుందర్ సంగీతం అందించిన ఈ  సినిమాని సితారఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ మూవీలో నాగ చైతన్య ఫస్ట్ టైమ్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో కనిపించ బోతున్నాడు. రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 13న వినాయక చవితి కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: