బిగ్ బాస్ సీజన్ ముగింపుకు దగ్గర పడుతున్న ఈ టైంలో ప్రతి రోజు ఆట ఆసక్తిగా మారింది. ఇక గడిచిన వారం నామినేషన్స్ లో నుండి కౌశల్, అమిత్, దీప్తిలు సేఫ్ అవ్వగా యాంకర్ శ్యామలా హౌజ్ నుండి బయటకు వచ్చింది. ఆల్రెడీ ఒకసారి ఎలిమినేట్ అయిన శ్యామలా మళ్లీ ఎలిమినేట్ అవడం జరిగింది.


ఇక ఆదివారం ఎపిసోడ్ లో ఆమె నానితో మాట్లాడుతూ బిగ్ బాస్ టైటిల్ కొట్టే వారిలో టాప్ 3 ఎవరు అంటే తనీష్, గీతా మాధురి, రోల్ రైడా పేరు చెప్పడం విశేషం. అలా చెప్పడమే కౌశల్ ఆర్మీ శ్యామలాని టార్గెట్ చేసేలా చేసింది. కౌశల్ ఆర్మీ ఎంత పవర్ ఫుల్ గా ఉందో తెలిసినా శ్యామలా కౌశల్ పేరు టాప్ 3లో చెప్పలేదు.


బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన ఆమె మీద కౌశల్ ఆర్మీ కక్ష్య కట్టింది. ఆమె మీద రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కౌశల్ వల్లే షో నడుస్తుంటే అలాంటి కౌశల్ టాప్ 3లో ఎలా ఉండడంటూ ఆమె మీద ప్రశ్నలు వేస్తున్నారు. ఇంకా కొందరు నాని, బిగ్ బాస్ టీం చెప్పారు కాబట్టే శ్యామలా అలా చెప్పిందని అంటున్నారు. 


ఇక మరోపక్క కౌశల్ కు సపోర్ట్ గా హైదరాబాద్ లో 2కే వాక్ కూడా జరిపారు. చూస్తుంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పోరులో ఆసక్తి నెలకొనేలా ఉంది. శ్యామలా మీద కౌశల్ ఆర్మీ చేస్తున్న నెగటివ్ కామెంట్స్ కౌశల్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఈ కామెంట్స్ పై శ్యామలా ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: