ఈ మద్య కొంత మంది నటీనటులు చేస్తున్న వ్యవహారాలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతున్నాయి.  తాజాగా కన్నడ నటుడు ఫుల్లుగా తాగి తాను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఓ బేకరీని ద్వంసం చేశాడు.  ప్రస్తుతం ఈ నటుడు అజ్ఙాతంలో ఉన్నట్లు తెలుస్తుంది.  వివరాల్లోకి వెళితే..కన్నడ నటుడు హుచ్చ వెంకట్ అంటే తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది.

గత కొంత కాలంగా ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువుగా నిలుస్తున్న హుచ్చా వెంకట్ తాజాగా  రాత్రంతా ఫుల్లుగా మద్యం తాగేశాడు , ఉదయమే లేచి అదే మత్తులో దగ్గరలోని ఓ బేకరీ లోకి వెళ్లి గొడవ చేసాడు దాంతో ఆ బేకరీ యజమాని తొలుత షాక్ తర్వాత మనోడు చేసే రాద్దాంతానికి ఎదురు తిరిగాడు.

దాంతో తాను సెలబ్రెటీ అని..తనకు ఎదురు చెబుతావా అని  హుచ్చ వెంకట్ బేకరీ లోని వస్తువులను కిందపడేసి అక్కడినుండి వెళ్ళిపోతున్న సమయంలో బేకరీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సకాలంలో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హుచ్చ వెంకట్ ని హెచ్చరించి అక్కడి నుండి పంపించారు . హుచ్చ వెంకట్ నటుడు కావడంతో కేసు పెట్టకుండా హెచ్చరించి పంపించారు పోలీసులు .


మరింత సమాచారం తెలుసుకోండి: