Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Sep 20, 2018 | Last Updated 10:18 am IST

Menu &Sections

Search

ప్రెస్టీజియస్ క్రిష్-కంగన "మణికర్ణిక - క్వీన్ ఆఫ్ ఝాన్సి" షూటింగ్ ఆగిపోయిందా? అసలు కథేంటి?

ప్రెస్టీజియస్ క్రిష్-కంగన "మణికర్ణిక - క్వీన్ ఆఫ్ ఝాన్సి" షూటింగ్ ఆగిపోయిందా? అసలు కథేంటి?
ప్రెస్టీజియస్ క్రిష్-కంగన "మణికర్ణిక - క్వీన్ ఆఫ్ ఝాన్సి" షూటింగ్ ఆగిపోయిందా? అసలు కథేంటి?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రఖ్యాత బాలీవుడ్ "క్వీన్" కథానాయిక కంగనారనౌత్ ప్రధానపాత్రలో వస్తున్న దృస్య కావ్యం "మణికర్ణిక..ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ" భారత ప్రథమ స్వాతంత్ర సమర యోధురాలు, వీరనారి "ఝాన్సీ లక్ష్మీబాయి" జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం పాఠకులకు తెలిసిందే. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను టాలీవుడ్ గౌతమీ పుత్ర శాతకర్ణి తో కీర్తి కిరీటాలు అందుకున్న క్రిష్ తీసుకున్నాడు. 
bollywood-news
అయితే కారణాంతరాల వలన "ఎన్టీఆర్" తెలుగువారి అభిమాన నట రాజకీయవేత్త దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర (బయోపిక్) తీస్తుండటంతో, బిజీ షెడ్యూల్ వల్ల "మణికర్ణిక బృందం" నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు క్రిష్. ఆ తర్వాత మణికర్ణిక దర్శకత్వ బాధ్యతలను ఆ సినిమా హీరోయిన్ కంగనా రనౌత్ చేప ట్టింది. అయితే కంగనా స్టార్ హీరోయిన్ అయినప్పటికీ, ఆమెకు దర్శకత్వం చేయగల నైపుణ్యం లేదని భావించిన నటుడు సోనూ సూద్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చాడు. ఈ ఇద్దరు ఆ సినిమాలో ప్రధాన బాధ్యతలు నిర్వహించే వారే. ఇలా అనేక కారణాలతో చిత్ర నిర్మాణం ఆలస్యం అవటూ ఉండటంతో ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. 
bollywood-news
దురదృష్టం ఏమిటంటే సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువైందంటూ, ఇప్పుడు చిత్ర నిర్మాత సంజయ్ కుట్టి కూడా మణికర్ణిక చిత్ర నిర్మాణ బాధ్యతల నుండి  తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే వివిధ కారణాల వల్ల మణికర్ణిక షూటింగ్ వాయిదా పడుతూ వస్తుండటం వల్ల సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే చాలా పెరిగి పోయిందట. బడ్జెట్ అంతకంతకూ పెరుగుతుండటంతో నిర్మాతలెవరూ నష్టపోకూడదని భావించిన ఈ చిత్ర బృందం సినిమా నిర్మాణం రద్దు చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 
bollywood-news
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అర్థాంతరంగా నిలిచిపోతుందనే వార్త ఈ సినిమాపై ఆశపెట్టుకున్న అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. కొత్త నిర్మాతలు ఎవరైనా "మణికర్ణిక సినిమా" నిర్మాణ బాధ్యతలు తీసుకుంటారా? మణికర్ణిక షూటింగ్ కొనసాగుతుందా? సినిమా పూర్తిగా నిలిచిపోతుందా? అనేది తెలియాలంటే మనం కొన్నిరోజులు ఆగాలి. 

bollywood-news

ఈ మధ్యకాలంలో ఏ ప్రాజెక్ట్ నుండి కూడా ఇంతమంది బయటకి వెళ్లినట్లు లేరు కానీ 'మణికర్ణిక' సినిమా విషయంలో మాత్రం ఒక్కొక్కరుగా బయటకి వెళ్లిపోతున్నారు. దీనికి రకరాల కారణాలు చెబుతున్నారు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రస్తుతం హీరోయిన్ కంగనా రనౌత్ టేకప్ చేసింది.

bollywood-news

క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ తో బిజీగా ఉండడంతో ఆ బాధ్యతలు కంగనాకు అప్పగించారు. దాదాపు సినిమా పూర్తయింది. ప్యాచ్ వర్క్ మాత్రమే కంగనా నేతృత్వంలో జరుగుతోంది. కంగనా డైరెక్టర్ అనే విషయం సోనూసూద్ కి నచ్చక ఆయన ప్రాజెక్ట్ నుండి వాకౌట్ చేశాడు. దర్శకురాలిగా కంగనాకి ఏం అర్హత ఉందని ఆయన మీడియా ముఖంగా అన్నారు.

bollywood-news

తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి నిర్మాత సంజయ్ కుట్టి కూడా తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు కొత్త నిర్మాతలు ఈ సినిమాను టేకప్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ₹70 కోట్లు అనుకున్న బడ్జెట్ కాస్త ఇప్పుడు ₹100 కోట్లకు చేరుకోవడం, విడుదల కూడా వాయిదా పడే అవకాశాలు ఉండడంతో నిర్మాత ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని టాక్. 

bollywood-news

bollywood-news
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మన టాలీవుడ్ హీరోల సామాజిక బాధ్యత సృహ లో హాస్యం రసవత్తరం
గోదావరి పుష్కరాల్లో జనహననంపై - రిటైర్డ్ జడ్జ్ సోమయాజులు నివేదిక రాసిందెవరు?
డిల్లీలో నరెంద్ర మోడీ దెబ్బ - గోల్కొండలో ఒవైసీలు అబ్బా!
రాజకీయ వర్షంలో తడిసిపోనున్న మిర్యాలగూడా కులం బాధితురాలు అమృతవర్షిని
టిఆరెస్ స్పీడ్ - మహాకూటమి బేజార్!  కూటమికి పురిట్లోనే సంధి కొడుతుందా?
బిజెపి రాష్ట్రాన్ని ముంచింది - కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ లోటు భర్తీ అవుతుంది: రాహుల్ గాంధి
ఎమెల్యే ఆర్కె రోజాపై చేసిన ధారుణ వ్యాఖ్యలకు టిడిపి ఎమెల్యే బోడే ప్రసాద్ కు హైకోర్ట్ షాక్
కేరళ పోలీసులు ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు చేసిన అన్యాయానికి సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టు
టిఆరెస్ గెలిస్తే రాష్ట్రం రావణ కాష్టమే - రజాకార్ల పాలనే!: అమిత్ షా
"ఆపరేషన్ గరుడ" విషయంలో శివాజిని నిఘాసంస్థలు విచారించవలసిన అవసరంలేదా?
వారంట్ కే  ఇంత సీనా? నటుడు శివాజికి మానసిక సమస్యలున్నాయా?
బ్రేకింగ్ న్యూస్: ఇండియా టుడే  2018-19 ఎలక్షన్ సర్వే మోడీ - కెసిఆర్ హిట్ - చంద్రబాబు ఫట్
ఆంధ్రా పోలీసులను – దొంగల ముఠాలా కాంగ్రెస్ కోసం మొహరించారు: టీఆర్‌ఎస్
స్పెషల్:  ఎవరి కోసం అమరావతి? కులవాదంతో తరిస్తే అది భ్రమరావతే?
ఒక ప్రయాణం మరచి పోలేని వ్యక్తులు ఇద్దరు - రాజకీయ నాయకులు అంతా ఒకటి కాదు
About the author