యువ సంచలనం విజయ్ దేవరకొండ హీరోగా కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ ఆనంద్ రంగ డైరక్షన్ లో వస్తున్న సినిమా నోటా. పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సిఎంగా నటిస్తున్నాడు. ఈమధ్యనే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై క్రేజ్ తీసుకొచ్చింది. పర్ఫెక్ట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీగా నోటా సంచలనంగా మారుతుంది.


ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. ఈ టైంలో విజయ్ తన నోటాతో సంచలనంగా మారనున్నాడు. ఇక రీసెంట్ గా గీతా గోవిందంతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ నోటా సినిమా బిజినెస్ విషయంలో దుమ్ముదులిపేస్తున్నాడు. నోటా కేవలం తెలుగు రైట్సే 30 కోట్ల దాకా అమ్ముడయ్యాయట.


ఈమధ్య రజినికాంత్ సినిమాలకు కూడా తెలుగు డబ్బింగ్ సినిమాలకు ఈ రేంజ్ మార్కెట్ జరుగలేదు. ఇక తమిళంలో గీతా గోవిందం సినిమా కూడా వసూళ్లతో రికార్డులు సృష్టించింది. అక్కడ కూడా మన అర్జున్ రెడ్డికి భారీగా ఫాలోయింగ్ ఏర్పడింది. కే.యి.జ్ఞానవెల్ రాజా నిర్మిస్తున్న నోటా సినిమా అక్టోబర్ 4న రిలీజ్ కానుంది. 


ఈ సినిమా బిజినెస్ చూస్తుంటే మరోసారి విజయ్ స్టామినా ఏంటో ప్రూవ్ అయ్యిందని తెలుస్తుంది. తెలుగులో 30 కోట్లు అంటే సినిమా పాజిటివ్ టాక్ వస్తే అది పెద్ద కష్టం కాకపోవచ్చు. విజయ్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించిన నోటా సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.    



మరింత సమాచారం తెలుసుకోండి: