ఊహించని విధంగా ‘అరవింద సమేత’ ఆడియో ఫంక్షన్ రద్దు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల 20వ తారీఖున ఆడియో ఫంక్షన్ ను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో చివరి నిముషంలో ఈమూవీ దర్శక నిర్మాతల ఆలోచనలలో వచ్చిన మార్పులు వల్ల ‘అరవింద సమేత’ ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. 
aravinda-sametha-pre-release-business-creates-ultimate-record_kuwait
హరికృష్ణ చనిపోయి ఇంకా ఒకనెల కూడ పూర్తి అవ్వకపోవడంతో పాటు ఈమూవీ నిర్మాణ పనుల విషయంలో క్షణం తీరిక లేకుండా పరుగులు తీస్తున్న కారణాల వల్ల ఈమూవీ ఆడియో ఫంక్షన్ ను క్యాన్సిల్ చేసి ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ప్రాంతంలో నిర్వహించాలి అన్న ఉద్దేశ్యంతో ఈమార్పులు వచ్చినట్లు సమాచారం. అక్టోబర్ మొదటి వారంలో ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది అని తెలుస్తోంది.
A still from the teaser
అప్పటికి హరికృష్ణ చనిపోయి నెలరోజులు దాటిపోతుంది కాబట్టి ఈ ఫంక్షన్ ను అత్యంత ఘనంగా నిర్వహించినా ఎవరూ తప్పుపట్టరు అన్న ఆలోచనలతో ఈమార్పులు జరిగినట్లు సమాచారం. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బాలకృష్ణతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడ అతిధులుగా వచ్చి జూనియర్ మూవీకి సంఘీభావాన్ని తెలియచేయడమే కాకుండా తామంతా ఒకటే అన్న సంకేతాలు ఇవ్వడానికి ఒక అస్త్రంగా ‘అరవింద సమేత’ ఫంక్షను మార్చబోతున్నారని టాక్. 
Aravinda Sametha Veera Raghava Teaser
ఈ మారిన పరిణామాల నేపధ్యంలో ‘అరవింద సమేత’ పాటలను ఆడియో ఫంక్షన్ లేకుండా డైరెక్ట్ గా విడుదల చేయాలని ఈమూవీ దర్శక నిర్మాతలు ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక శక్తిగా మారిన నేపధ్యంలో పవన్ మ్యానియాను తట్టుకుని ఎదురు దాడి చేయాలి అంటే తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత పరిస్థుతులలో అన్ని విధాలా జూనియర్ ఎన్టీఆర్ సహాయ సహకారాలు అవసరం అయిన నేపధ్యంలో నారా-నందమూరి కుటుంబాల ఐక్యతా రాగానికి ‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకవేదిక కాబోతోంది అనుకోవాలి. మరి ఈవిషయాలలో ఇంకా ఎన్ని ఊహించని మార్పులు వస్తాయో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: