కత్తి మహేష్ ఈ పేరు వింటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు.  తెలుగు ఇండస్ట్రీలో సినీ విశ్లేషకుడిగా పరిచయం అయి..ఒకటీ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన కత్తి మహేష్ ఆ మద్య ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ‘బిగ్ బాస్ ’ సీజన్ 1 లో ఇంటి సభ్యుడిగా కనిపించాడు.  ఆ తర్వాత జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దాదాపు నాలుగు నెలల పాటు పవన్ ఫ్యాన్స్ కి కత్తి మహేష్ కి సోషల్ మీడియా యుద్దం జరిగింది. ఒకానొక సందర్భంలో కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్ మద్య రాజీ కుదిరినట్లు అనిపించింది. 


కానీ అప్పుడప్పుడు మనోడు పవన్ పై సెటైర్లు విసురుతూనే ఉన్నాడు.  ఇది కాదని ఆ మద్య నటి శ్రీరెడ్డి విషయంలోనూ కూడా కాంట్ర వర్సీ చెలరేగింది.  ఇలా వివాదాలు చుట్టూ తిరుగుతున్న కత్తి మహేష్ భారతీయులు ఎంతో పవిత్రంగా కొలిచే శ్రీరాముడు, సీతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో విషయం కాస్త సీరియస్ అయ్యింది.  ఆ ప్రభావం కత్తి మహేష్ పై బాగానే పడుతోంది. టివి చర్చా కార్యక్రమాల్లో భాగంగా కత్తి మహేష్ శ్రీరాముడిపై, సీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Image result for LORD SRI RAMA

దీని పర్యవసానంగా హైదరాబాద్ పోలీసులు కత్తి మహేష్ ని నగరం నుంచి 6 నెలలు బహిష్కరించారు.శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ ని హిందూ మద్దతు దారులు విడచిపెట్టేటట్లు కనిపించడం లేదు. గడ్డం శ్రీధర్ అనే వ్యక్తి న్యాయనిపుణులతో కలసి హైదరాబాద్ లో కత్తి మహేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసు వారి విధానాల ప్రకారం ఈ కేసు విచారణ జరపవలసి ఉంటుంది. దీనితో పోలీసు వారి ముందు కత్తి మహేష్ తన వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: