నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ బిజినెస్ 25కోట్ల స్థాయిని మించి జరగడంతో ఈమూవీ పై మోజుతో అత్యంత భారీ రేట్స్ కు కొనుక్కున్న ఈమూవీ బయ్యర్లకు సేఫ్ ప్రాజెక్ట్ గా మారుతుందా? అన్న  చర్చలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలాలో జరుగుతున్నాయి. ఒక సినిమాకు ఎంత ఖర్చు అయినా ఆ సినిమా విజయానికి ఏదో ఒక పాయింట్ కీలకంగా వర్కవుట్ అవుతుంది.
Naga Chaitanya,Shailaja Reddy Alludu,Ramya Krishnan
అది ఒక కమెడియన్ వర్క్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు హీరోయిన్ కావచ్చు ‘ఫిదా’ కు సాయిపల్లవి ‘గీత గోవిందం’ సినిమాకు వెన్నెలకిషోర్ ఇలా ఆసినిమాల ఘనవిజయానికి దోహద పడ్డారు అన్నది ఎవరైనా ఒప్పుకు తీరవలసిన సత్యం. ఇప్పుడు ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా కూడా కేవలం ఒక పాయింట్ మీదనే అత్యంత భారీ స్థాయిలో చైతన్య సినిమాల స్టామినాను మించి బిజినెస్ జరిగింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈసినిమాలో నాగచైతన్య హీరో అయినా బిజినెస్ అంతా ఈమూవీలో కీలక పాత్ర పోషించినా రమ్యకృష్ణ పేరు పైనే జరిగింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు హడావిడి చేస్తున్నాయి.

ఈ మూవీలో రమ్యకృష్ణది కీలకపాత్ర మాత్రమే కాకుండా ‘బాహుబలి’ తరువాత రమ్యకృష్ణ  స్క్రీన్ మీద ఎక్కువ సేపు కనిపించే పాత్ర అని అంటున్నారు. ప్రత్యేకించి ఫ్యామిలీ ప్రేక్షకులు రమ్యకృష్ణ అహంకార నటన చూడానికి వస్తారు అన్న నమ్మకంలో బయ్యర్లు ఉన్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో నటించి నందుకు రమ్యకృష్ణకు కోటి రూపాయల రెమ్యూనిరేషన్ ఇచ్చినట్లు టాక్. దాదాపు టాప్ హీరోయిన్ రెమ్యూనిరేషన్ తో సమానంగా రమ్యకృష్ణకు ఈమూవీలో   కీలక పాత్ర పోషించి నందులకు ఇవ్వడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

ఈమూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ కు భారీ మొత్తం రావడం వెనుక రమ్యకృష్ణ ‘బాహుబలి’ శివగామి ఇమేజ్ బాగా పని చేసింది అన్నవార్తలు వస్తున్నాయి. రమ్యకృష్ణ‌ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే మామూలుగా ఆమె రోజువారీగా డేట్స్ కేటాయిస్తే ఒక్కో రోజుకు ఐదు లక్షల రూపాయల రెమ్యూనరేషన్‌ ను తీసుకుంటుంది అన్నవార్తలు ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగా  ‘శైలజా రెడ్డ్డి’  సక్సస్స్ అయితే రమ్యకృష్ణ  పారితోషికం మరింత పెరిగే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ‘శైలజా రెడ్డి’ విజయవంతం అయితే ఆ క్రెడిట్ రమ్యకృష్ణ అకౌంట్ లోకి వెళ్లి పోతుందా లేదంటే నాగ చైతన్య ఎకౌంటులోకి వెళ్ళిపోతుందా అన్న విషయం మరో రెండురోజులలో తేలిపోతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: