కామెడీ దర్శకుడు మారుతి దర్శకత్వంలో నాగచైతన్య, అను ఎమాన్యూల్‌ జంటగా తెరకెక్కిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 13న వినాయక చవితి సందర్బంగా భారీ ఎత్తున ఈ చిత్రంను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.  ఇప్పుడు లిప్ టు లిప్ కిస్ అన్నది ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ ఫ్యాషన్.  గతంలో హాలీవుడ్ కే పరిమితం అయిన ఈ ఫ్యాషన్ ఇప్పుడు భారతీయ చిత్రాలపై కూడా ప్రభావం పడింది.  ఈ మద్య రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100, గీతా గోవిందం లాంటి సినిమా లిప్ టు లిప్ కిస్ ప్రేక్షకుల మతులు పోగొట్టాయి.   
Image result for శైలజారెడ్డి అల్లుడు
మారుతి గత చిత్రాల్లో ముద్దు సీన్స్‌ లేవు. కాని ప్రస్తుతం ముద్దు సీన్స్‌ ట్రెండ్‌ నడుస్తున్న కారణంగా నాగచైతన్యను ఒప్పించి మారుతి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.  శైలజారెడ్డి అల్లుడు సినిమాలో హీరో హీరోయిన్లు చైతన్య-అను ఇమ్మాన్యుయేల్ ల నడుమ ఒక లిప్ టు లిప్ కిస్ సీన్ లాగించేసినట్లు తెలుస్తోంది. అయితే మరీ అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100ల మాదిరిగా సెకెండ్లకు సెకెండ్లు జుర్రేసుకునే టైపులో కాకుండా చాలా రొమాంటిక్ గా ఉండబోతున్నట్లు సమాచారం. 
Image result for శైలజారెడ్డి అల్లుడు
శైలజారెడ్డి అల్లుడు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా లవ్ అండ్ రొమాన్స్ ట్రాక్  మీదనే నడుస్తుంది. నాగచైతన్య ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. రమ్యకృష్ణ అత్త పాత్ర పోషించడంతో పాటు పొగరుబోతు కూతురు పాత్రలో అను ఎమాన్యూల్‌ చక్కగా సూట్‌ అయ్యింది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో సినిమా కూడా బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: