బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్టింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.  అయితే బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి ఇంకొంచెం మసాలా..ఇక్కడ ఏదైనా జరగొచ్చు అంటూ వస్తున్నారు.  అయితే మసాల సంగతి ఏమో కానీ..మొదటి నుంచి ఇంటి సభ్యులపై బ్యాడ్ కామెంట్స్, బ్యాడ్ ట్రోల్స్ మాత్రం బాగా వస్తున్నాయి. ఒకదశలో నానిపై కూడా విమర్శలు రావడం చూశాం.  సీజన్ 1 లో ఇంటి సభ్యులు ఎంతో జన్యూన్ గా ఆడారని..ఇప్పుడు మాత్రం టీమ్ సభ్యుల్లో అంత స్వార్థ చింతనతోనే టాస్క్ లు, ప్లాన్లు, కూటములు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. 

 కక్కలేక మింగలేక పోతున్నారు

ఏది ఏమైనా బిగ్ బాస్ 2 సీజన్ చివరి దశకు చేరుకుంది.  మంగళవారం జరగబోయే టాస్క్ వినోదాత్మకంగా ఉండబోతోంది. హౌస్ లో ఉండేది 7 మంది మాత్రమే అయినా షో ఉత్కంఠ భరితంగా సాగుతోంది.  బిగ్ బాస్ లో తాజాగా   ఇంటి సభ్యులకు 24 సినిమా చూపించబోతున్నాడు. ఇంటి సభ్యులని బిగ్ బాస్ కంట్రోల్ చేయబోతున్నాడు. అంటే 24 సినిమా తరహాలో బిగ్ హోస్ హౌస్ ని కొంత సమయం ఫ్రీజ్ చేస్తో, మరికొంత సమయం నార్మల్ గా ఉంచుతున్నాడు. బిగ్ బాస్ ఫ్రీజ్ అని చెప్పగానే ఎక్కడివాళ్ళు అక్కడే కదలకుండా ఉండిపోవాలి.

బయటకు పారిపోయాడు

ఇదే సమయంలో ఎంట్రెన్స్ నుంచి జోకర్ ముసుగు వేసుకొని ఓ అజ్ఞాత వ్యక్తి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. జోకర్ గెటప్ లో వచ్చిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలియదు. ఇంటి సభ్యులంతా ఫ్రీజ్ లో ఉండగా హౌస్ మేట్స్ ని ఆటపట్టిస్తున్నాడు.

అమిత్ ఫ్యామిలీ

గిలిగింతలు పెడుతుంటడంతో రోల్ కక్కలేక మింగలేక నవ్వు ఆపుకుంటున్నాడు.  ఇక ఇంటి సభ్యులు నార్మల్ మోడ్ లోకి రాగానే ఆ జోకర్ అక్కడ నుంచి తుర్రుమన్నాడు.  ఇదిలా ఉంటే..నేడు అమిత్ ఫ్యామిలీ రాబోతున్నట్లు ప్రోమోలో చూపించారు. పప్పా అంటూ అమిత్ కొడుకు అతడిని కౌగిలించుకోగానే అతడు భావోద్వేగానికి గురయ్యాడు. అమిత్ సతీమణి కూడా హౌస్ లోకి ఎంటర్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: