వినాయకచవితి పండుగ రోజున విడుదల కాబోతున్న ‘యూటర్న్’ మూవీని సమంత చాల గట్టిగా ప్రమోట్ చేస్తోంది. ఈనేపధ్యంలో ఆమెకు మీడియా వర్గాల నుండి ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ చైతన్యను ముద్దాయిగా చేసింది. వచ్చే నెలతో సమంతకు చైతూతో పెళ్లి అయి ఒక సంవత్సరం అవుతున్న నేపధ్యంలో తల్లి అయ్యేది ఎప్పుడు అంటూ ఒక మీడియా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమంత షాకింగ్ సమాధానం ఇచ్చింది. 
samantha u turn movie promotions - Sakshi
తనకు పిల్లలు అంటే చాలా ఇష్టమని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగచైతన్య మాత్రం రెడీగా లేడని అంటూ తప్పు అంతా చైతన్య పై నెట్టేసి తప్పించుకుంది సమంత. "పిల్లలు ఎప్పుడనేది ఇంకా ప్లాన్ చేయలేదు. నాగచైతన్య ఎప్పుడంటే అప్పుడు. నాకైతే పిల్లలు కావాలనే ఉంది. కానీ ఈ విషయంలో చైతూను ఎక్కువగా ఇబ్బంది పెట్టను. పిల్లలకు సంబంధించి చై ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తాడో ఏమో?" అంటూ క్లారిటీ ఇచ్చింది. 
Samantha
ఇదే సందర్భంలో తన సినిమాకు చైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ మూవీకి మధ్య జరుగుతున్న పోటీ పై కామెంట్ చేస్తూ "ఓ భార్యగా, నా భర్త ఆనందం నాకు చాలా ఇంపార్టెంట్. అతడికే సక్సెస్ రావాలని కోరుకుంటాను. నాకు ఏదైనా నాగచైతన్య తర్వాతే. కాకపోతే యూటర్న్ సినిమాను ఎంతో ఇష్టపడి చేశాను. కాబట్టి ఇది కూడా హిట్ అవ్వాలని కోరుకుంటాను. ఈ సినిమాతో నాకు కావాల్సింది మంచి పేరు కాదు, డబ్బు కావాలి." అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 
Samantha's-Only-Telugu-Film-Coming-to-Closure---U-Turn
ఇక్కడ సమంత మరొక ట్విస్ట్ ఇస్తూ మంచి పాత్రలు దొరికితే తాను ఎన్ని సినిమాలలో అయినా నటిస్తానని అయితే రెగ్యులర్ హీరోయిన్ పాత్రలను మాత్రం తాను నటించే పరిస్థితులలో లేను అంటూ తన భవిష్యత్ ప్రణాళికలు వివరించింది. గతంలో లా తాను అవకాశాలు కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి తనకు లేదు అంటూ తనకు నచ్చిన పాత్ర లభించకపోతే ఇంట్లో ఖాళీగా కూర్చుంటాను కాని తాను పాత్రల ఎంపికలో రాజీ పదను అంటూ కామెంట్స్ చేసింది. ఇంతకీ పిల్లల విషయంలో చైతన్య ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: