తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీగా వస్తున్న ‘దేవదాస్’ ఇప్పటికే పోస్టర్స్, టీజర్, సాంగ్ తో దుమ్మురేపుతుంది.  మొదటి సారిగా వెండితెరపై కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వస్తున్న ‘దేవదాస్’ చిత్రం నుంచి తాజాగా గణేషుడికి సంబంధించిన ఓ సాంగ్ రిలీజ్ అయ్యింది.   వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు.  ఇటీవల ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌, లిరికల్‌ వీడియోలతో సందడి చేస్తున్నారు.  


 రేపు 'వినాయకచవితి' కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాలోని వినాయక నిమజ్జన ఉత్సవానికి సంబంధించిన పాటను వదిలారు."లక లక లకుమీకరా లంబోదరా .. జగ జగ జగదోద్ధారా విఘ్నేశ్వరా . .  లక లక లకుమీకరా లంబోదరా .. రకరకముల రూపాలు నీవే దొరా .. వెళ్లి రారా .. మళ్లీ రారా .. ఏడాదికోసారి మాకై దిగిరారా .." అంటూ ఈ పాట కొనసాగుతోంది. మణిశర్మ సంగీత దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. 


అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.  రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. మణిశర్మ సంగీతం ఆకట్టుకునేలా వున్నాయి. అనురాగ్ కులకర్ణి .. శ్రీకృష్ణ ఈ ఉత్సవం పాటను మంచి ఉత్సాహంతో ఆలపించారు. వినాయక నిమజ్జనోత్సవానికి సంబంధించి జనం నాల్కలపై నాట్యం చేసే సినిమా పాటల్లో ఒకటిగా ఈ పాట నిలిచిపోతుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: