తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న హీరో ఇళయదళపతి విజయ్.  ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి త‌మిళంలో ఏ రేంజ్ క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఆయ‌న సినిమా కోసం అభిమానులు వేయి క‌ళ్ళ‌తో ఎదురు చూస్తుంటారు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న స‌ర్కార్ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్‌. విజయ్ నటిస్తున్న 62వ త‌మిళ చిత్రం ‘సర్కార్’. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వుంది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Image result for vijay sarkar

విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు.. ఎఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో విజయ్ కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్నది.. వరలక్ష్మీ కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌నుంది. సెప్టెంబర్ 13న వినాయక చవితి సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ విడుద‌లకి ప్లాన్ చేసిన టీం చిత్ర ఆడియో వేడుక‌ని అక్టోబ‌ర్ 2న చెన్నైలో గ్రాండ్‌గా జ‌రిపేందుకు స‌న్నాహాలు చేస్తుంది. అయితే ఈ వేడుక‌కి త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ని గెస్ట్‌గా ఆహ్వ‌నించాల‌ని టీం భావిస్తుంద‌ట‌.

Image result for vijay sarkar

ఇప్ప‌టికే తెలుగులో ఒక స్టార్ హీరో ఫంక్ష‌న్‌కి మ‌రో స్టార్ హీరో అతిధిగా వ‌చ్చే ట్రెండ్ న‌డుస్తుండ‌గా, ఇప్పుడు త‌మిళంలో కూడా ఇది మొద‌లైంద‌ని అంటున్నారు. ర‌జ‌నీకాంత్ క‌నుక ఈ ఆడియో వేడుక‌కి హాజ‌రైతే మాత్రం ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్‌ని ఒకే వేదిక‌పై చూసే అభిమానుల‌కి రెండు క‌ళ్ళు సరిపోవు.భారీ బడ్జెట్ తోసన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది.ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుక‌ను చెన్నైలో అక్టోబ‌ర్ 2న నిర్వ‌హించ‌నున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: